చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు 

భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుక గా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 
 
సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ లచిత్ బర్ ఫూకన్ మొఘలులను ఓడించిన అస్సాంకు చెందిన అహోమ్ సామ్రాజ్యపు రాయల్ ఆర్మీకి జనరల్ గా ప్రసిద్ధికెక్కారని, ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ ఆకాంక్షలను రాయల్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకొందని గుర్తు చేశారు. 
 
లచిత్ బర్ ఫూకన్ ఘన కార్యాలు అస్సాం చరిత్ర లో ఒక వైభవోపేతమైనటువంటి అధ్యాయం అని పేర్కొంటూ దాస్యం తాలూకు మనస్తత్వం బారి నుండి తప్పించుకొని భారతదేశం తన వారసత్వం పట్ల గర్వపడే మన:స్థితి కి చేరుకొందని ప్రధాని తెలిపారు. 
 
‘‘భరత మాత అమర పుత్రుల లో లచిత్ బర్ ఫూకన్ వంటి వారు ‘అమృత కాలం’ తాలూకు సంకల్పాల ను నెరవేర్చుకోవడం లో ఒక ప్రేరణ గా నిలుస్తారు. వారు మన చరిత్ర  విశిష్టతను, గుర్తింపును మనకు ఎరుకపరుస్తారు. అంతేకాక మనలను మనం దేశాని కి అంకితం చేసుకొనేందుకు కూడా వారు ఉత్తేజాన్ని అందిస్తారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 
ప్రాచీన కాలంలో మునులు, పండితులు భారతదేశపు ఆధ్యాత్మిక గుర్తింపును, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడడానికి నడుంకట్టగా, లచిత్ బర్ ఫూకన్ వంటి యోధులు తీవ్రవాద శక్తులకు, ఉగ్రవాద శక్తులకు అంత్య కాలం ఉంటుందే తప్ప భారతదేశపు జీవనానికి సంబంధించిన వెలుగు లు అంతరించిపోవని చాటి చెప్పారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
 
భారతదేశపు చరిత్ర అంటే అది ఒక్క బానిసత్వం మాత్రమే కాదని, అది విజయాన్ని వరించడం, లేక్కలేనంత మంది మహనీయుల  వీరత్వం గురించిన చాటింపు అని ప్రధాని మోదీ కొనియాడారు.భారత దేశపు చరిత్ర అంటే, అది క్రూర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అపూర్వమైన ధైర్య సాహసాలతో పోరుకు సిద్ధం కావడమే అని కూడా ఆయన చెప్పారు. 
 
‘‘దురదృష్టవశాత్తు, మనకు స్వాతంత్య్రం అనంతర కాలంలో సైతం బానిసత్వ కాలం లోని ఒక కుట్ర మాదిరిగా లిఖించిన చరిత్రనే పాఠాలుగా బోధిస్తూ వచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనలను బానిసలుగా మార్చుకొన్న విదేశీయుల కార్యసరళిని మార్చవలసిన అవసరం ఏర్పడింది, అయితే, అది జరగనే జరగలేదు’’ అని ఆయన ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 
 
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశంలో ప్రతి చోట భీకరమైన స్థాయిలో ఎదురైన ప్రతిఘటన తాలూకు గాథలను ఉద్దేశ్య పూర్వకంగా అణచివేయడం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎన్నో విజయ గాథలు ఉన్నాయి. వాటికి ప్రధాన స్రవంతిలో భాగం పంచకపోవడం అనే పొరపాటును ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నది,’’ అని పేర్కొన్నారు.