బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబొం.. సంజయ్ హెచ్చరిక

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కు విచారణకు హాజరు కమ్మనమని నోటీసు ఇవ్వడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌‌లో నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని, సహించబోమని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
బీజేపీ ప్రధాన కార్యదర్శి, సంఘ్ ప్రచారక్ అయిన బీఎల్ సంతోష్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ కి ఫామ్ హౌజ్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవని చెబుతూ ఎవరో ఏదో మాట్లాడితే బీఎల్ సంతోష్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సంఘ్ ప్రచారక్‌లను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
 
 ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ అనుకోలేదని, ఆస్తులు కూడబెట్టలేదని, విదేశాల్లో వ్యాపారం చేయలేదని చెప్పారు. ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి బయట పడేందుకే సంతోష్‌ను అవమానిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుట్రలను ఎక్కడిక్కడ తిప్పి కొడతామని, గడీల పాలనను త్వరలోనే బద్దలు కొడతామని  స్పష్టం చేశారు.
 
కేసీఆర్ కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని, సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నారనిసంజయ్ ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గాలను గ్రహించిన కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తూ,  నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటుంటే దానిని కూడా టీఆర్ఎస్ తప్పుపడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
 
“మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను చి‘‘తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉన్న స్టేట్.. కేసీఆర్ పాలనలో అడుక్కునే స్థాయికి దిగజారింది. పుట్టబోయే బిడ్డపై లక్షా 50 వేల అప్పు చేశారు. కేసీఆర్ పాలన పుణ్యమా అని ఏటా రూ.30 వేల కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నారు. అప్పు చేసి వడ్డీలు కట్టడానికే పరిమితమవుతారా? ఇదేనా బంగారు తెలంగాణ?’’ అని సంజయ్ ప్రశ్నించారు.
చేతికిచ్చి అడుక్కునే స్థాయికి కేసీఆర్ దిగజార్చారని దుయ్యబట్టారు.కేసీఆర్ పాలన బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. అప్పు చేసి వడ్డీలు కట్టడానికే పరిమితమవుతారా? ఇదేనా బంగారు తెలంగాణ?’’ అని సంజయ్ ప్రశ్నించారు. పక్కనున్న కర్నాటక రూ.60 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే.. తెలంగాణ తెచ్చింది కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌ను ఓడించేందుకు సిద్ధమని, యుద్ధానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని సంజయ్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు అన్నీ పార్టీలు టీఆర్ఎస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాయన్నట్లు కేసీఆర్ సంకేతాలు పంపుతున్నారని చెప్పారు.

‘‘తెలంగాణ కోసం టీఆర్ఎస్ చేసిన త్యాగమేంటి? సామాన్య ప్రజలు బలిదానం చేస్తే.. వాటిని తన ఖాతాలో వేసుకుని అధికారం చెలాయిస్తూ మోసం చేస్తున్న పార్టీ నీది. చనిపోయిన వాళ్లను టీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్పుకునే నీచ స్థాయికి దిగజారింది నీవు కాదా?” అంటూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సంజయ్ నిలదీశారు. సిద్ధాంతం, విధానం, పద్ధతి లేని పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు.