ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక బంధువులే హత్య

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మహిళ లేదా అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతోందని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రెట‌రీ ఆంటోనియో గుట్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల చేతిలో లేదా భాగ‌స్వామి చేతిలో మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌నలో విచారం వ్య‌క్తం చేశారు.
 
న‌వంబ‌ర్ 25వ తేదీని అంత‌ర్జాతీయంగా మ‌హిళ‌ల‌పై హింస‌ నిరోధక దినోత్స‌వంగా నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా గుట్రెస్ మాట్లాడుతూ ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మ‌హిళ లేదా అమ్మాయి మీద చ‌నిపోతోంద‌ని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికలపై తీవ్రమైన హింస ప్రపంచంలో అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడ‌వాళ్ల మీద‌ హింస అనేది ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అని ఆయ‌న తెలిపారు. ఇంట్లోవాళ్లు లేదా స‌హ‌జీవ‌నంలో ఉన్న‌వాళ్లు మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వేధించ‌డానికి క‌రోనా ప్యాండెమిక్, ఆర్థిక సంక్షోభం వంటివి కూడా కార‌ణ‌మ‌ని గుట్రెస్ ప్ర‌స్తావించారు.

ఆన్‌లైన్‌లోనూ మ‌హిళ‌ల‌పై ట్రోలింగ్, స్టాకింగ్ వంటివి పెరిగాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంలో సగం మంది మ‌హిళ‌లు ఈ ప‌రిస్థితి ఎదుర్కొంటున్నార‌ని, దీనివ‌ల్ల అమ్మాయిలు, మ‌హిళ‌లు త‌మ హ‌క్కులు, స్వేచ్ఛ‌, ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోతున్నార‌ని  గుట్రెస్ విచారం  వ్య‌క్తం చేశారు.

ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు జాతీయస్థాయిలో ప్రణాళికను అమలు చేయాలని పిలుపిచ్చారు25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌ హత్య నేపథ్యంలో గుటెరస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది థీమ్‌గా మహిళలు, బాలికలపై హింసను అంతం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
 
కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఇతర ఒత్తిళ్లు శారీరక, మౌఖిక దుర్వినియోగానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు, బాలికలు లైంగిక వేధింపులు, విద్వేష ప్రసంగాలు, వస్త్రధారణ, ఫొటోలతో  విస్తృతంగా ఆన్‌లైన్‌లోనూ హింసను ఎదుర్కొంటున్నారని చెప్పానారు. మానవ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు లక్ష్యంగా వివక్ష, హింస, దుర్వినియోగం అత్యధికంగా ఉందని తెలిపారు.
 
ఇటువంటి పరిస్థితి వారి సాధారణ హక్కులైన స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన హెచ్చరించారు. మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా హింస చరిత్ర పుస్తకాల్లో ఉండాలని, ఆ దిశగా తగిన చర్యలు చర్యలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని గుటెరస్‌ పేర్కొన్నారు.
 
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, నిధులు సమకూర్చడం, అమలు చేయడం, ప్రతిదశలోనూ అట్టడుగు వర్గాలు, ప్రజలు పాల్గనేలా చట్టాలు అమలు చేయాలని సూచించారు. 2026 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు 50 శాతం నిధులను పెంచేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు మద్దతుగా, వారికి సహకారం అందించేలా మనం నిలబడాలని, మనమంతా స్త్రీవాదులమని గర్వంగా చెప్పాలని హితవు పలికారు.