ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ అమీన్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్​ హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా ముఖంలో పశ్చాత్తాపం ఏమాత్రం  కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. 
 
స‌హ‌జీవ‌నం చేస్తున్న 26 ఏళ్ల శ్ర‌ద్ధా వాల్క‌ర్‌ను 28 ఏళ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపి, 35 ముక్క‌లు చేసి, ఫ్రిడ్జ్‌లో దాచి, ఆ త‌ర్వాత ఆమె శ‌రీరా భాగాల‌ను ఢిల్లీలోని పలు ప్ర‌దేశాల్లో పడేసిన సంఘటనలో పొలిసు దర్యాప్తులో విస్తు కలిగించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
అఫ్తాబ్‌, శ్ర‌ధ్దాలు బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. ముంబైలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ మొద‌లైంది. మూడేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేశారు. అయితే ఢిల్లీలో ఈ ఏడాది మే నెల‌లో శ్ర‌ద్ధాన అత‌ను చంపేశాడు. శ్ర‌ద్ధాను చంపిన 20 రోజుల వ్య‌వ‌ధిలోనే అదే డేటింగ్ యాప్‌లో మ‌రో అమ్మాయిని ప‌రిచయం చేసుకున్నాడు.
ఆమెతోనూ డేటింగ్ మొద‌లుపెట్టాడు. ఆ అమ్మాయిని కూడా ప‌దేప‌దే ఇంటికి తీసుకువ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అపార్ట్‌మెంట్‌లోనూ శ్ర‌ద్ధ శ‌రీర భాగాలు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మే 18న శ్రద్ధను కిందపడేసి, నోరు నొక్కి చెస్ట్​పై కూర్చొని గొంతుకోశానని పోలీసుల ముందు అంగీకరించాడు. ఆ తర్వాత డెడ్​ బాడీని బాత్​రూమ్​లోకి తీసుకెళ్లి దాచాడని పోలీసులు చెప్పారు.
మృతదేహాన్ని ఎలా మాయం చేయాలని గూగుల్​లో వెతికాడ, డీఎన్​ఏ శాంపిల్స్ దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని, బెడ్​ రూమ్​లో పడిన రక్తపు మరకలను తొలగించేందుకు రసాయనాలను ఉపయోగించి శుభ్రం చేశాడని పేర్కొన్నారు.  పలు వెబ్‌సిరీస్‌లు చూసి ఆనవాళ్లను మాయం చేసినట్టు తేలింది.
ఇంగ్లిష్‌ సీరియల్‌ కిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘డెక్స్‌టర్‌’, ఇతర క్రైం సిరీస్‌లను చూసి, ఇంటర్నెట్‌లో చదివి ఆనవాళ్లను మాయం చేసినట్టు పోలీసుల విచారణలో ఆఫ్తాబ్‌ తెలిపాడు. ఫ్రిజ్‌లో దాచిపెట్టిన శ్రద్ధా ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసేవాడు. తొందరగా పాడయ్యే శరీర అవయవాలను ముందుగా పారేసేవాడు.
 
శ్రద్ధ బతికే ఉన్నదని నమ్మించేందుకు ఆఫ్తాబ్‌ చాలా కుయుక్తులు పన్నాడు. అప్పుడప్పుడు ఆమె సోషల్‌ మీడియా ఖాతాల్లో లాగిన్‌ అయ్యేవాడు. ఆమె స్నేహితులకు మెసేజ్‌లు చేసేవాడు. ఆమె క్రెడిట్‌ కార్డుల బిల్లులు చెల్లించేవాడు. అయితే, శ్రద్ధ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావటం, సోషల్‌ మీడియాలో అప్‌డేట్లు లేకపోవటంతో స్నేహితులకు అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు.
 
ఇది లవ్ జిహాద్ 
 
లవ్‌‌‌‌‌‌‌‌ జిహాద్ పేరుతో తన కూతురిని హింసించి చంపిన అఫ్తాబ్​ ను ఉరితీయాలని శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్​ చేశారు.  అఫ్తాబ్​తో బంధం వద్దన్నందుకు శ్రద్ధ తనతో ఎక్కువ మాట్లేడేదికాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.  ముంబైలో ఉన్నప్పుడు అఫ్తాబ్ తనను కొడుతున్నాడని శ్రద్ధ తనతో చెప్పుకుని ఏడ్చిందని ఆమె దోస్తు చెప్పింది. ఈ కేసును లవ్​ జిహాద్​ కోణంలో దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ముంబై ఎమ్మెల్యే రాంకదమ్​ లెటర్​ రాశారు.
 
కాగా, జార్ఖండ్‌లో డిజిపిగా పదవీ విరమణ చేసిన 1983 బ్యాచ్ ఐపిఎస్  అధికారిణి నిర్మల్ కౌర్ శ్రద్ధా వాకర్ దారుణ ను ప్రస్తావిస్తూ, ముస్లిం పురుషులు ఉద్దేశపూర్వకంగా హిందూ బాలికలను ట్రాప్ చేస్తున్నారని, అందుకోసం వారికి భారీగా నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు.  హిందూ బాలికలను కిడ్నాప్ చేసే ముస్లిం పురుషులకు వారి కమ్యూనిటీ అవసరమైన అన్ని చట్టపరమైన సహాయాన్ని కూడా అందజేస్తుందని ఆమె చెప్పారు.
 
 “హిందూ మహిళలను ట్రాప్‌ చేసే వ్యక్తులకు మోటార్‌సైకిళ్లు లేదా భారీ ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ వ్యక్తులకు అవసరమైన అన్ని న్యాయ సహాయం కూడా అందించబడుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఉదంతాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, వారి ఉపసంస్కృతి దీనికి మద్దతు ఇస్తోంది. స్త్రీకి భావాలు లేవని, సమాజంలో విలువ లేదని వారి సమాజం అంగీకరించడం, వారి ప్రజలను నమ్మించడం ప్రారంభించింది. వారు ఆమెను ఒక వస్తువుగా చూస్తారు,” అని ఆమె పేర్కొన్నారు. 
 
సహజీవనంపై ఆగ్రవేశాలు 
ఈ సందర్భంగా సహజీవనం చట్టబద్ధంగా భావిస్తుండటం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అటువంటి ధోరణుల కారణంగానే యువతుల ఈ విధంగా బలవుతున్నారని ఆవేదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హత్య జరిగిన ఇంటి ఇరుగు, పొరుగు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 

“అత్యాచారాలు, హత్యలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ సహజీవనం సంబంధాన్ని ఆమోదించాయి, కానీ ఇప్పుడు ఈ రకమైన భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. సహజీవనంకు సమాజంలో స్థానం ఉండకూడదు” అని స్పష్టం చేస్తున్నారు.