“ఇక్ఫాయ్ “లో జరిగింది ర్యాగింగ్ కాదు..మతపర దాడి! 

ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేరొక్నటున్నారు. అదే విషయాన్ని మీడియా బయటపడుతుంది.
 కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్ధులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే  విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఈ సందర్భంగా గత శనివారం వైరల్ గా మారిన ఒక వీడియోలో ఒక హిందూ విద్యార్థిని ఇతర విద్యార్థులు `అల్లాహు అక్బర్’ తినమని వత్తిడి చేస్తూ భౌతికంగా కొట్టడం కనిపించడంతో ఈ విషయమై పెద్ద అలజడి రేగింది. లా చదువుతున్న హిమాంక్ బన్సల్ అనే విద్యార్థుని దారుణంగా హింసించడం స్పష్టం అవుతుంది. 
 
ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా  హైదరాబాద్ నగర కమిషనర్, మంత్రి కల్వకుంట్ల రామారావులకు  బాధితులు ట్విట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  కానీ బాధితులకు న్యాయం జరగడం లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ ఆరోపించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని వారు విమర్శించారు.
సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని పోలీసులు సమాచారం ఇస్తూ.. అసలు విషయాన్ని దాటవేస్తున్నట్లు వారు మండిపడ్డారు. ఇది సీనియర్, జూనియర్ల గొడవ కాదని, మతపరమైన దాడి అని వారు  స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కమ్యూనల్ కేసు కింద అరెస్టు చేసి, యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయంలో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని యూనివర్సిటీ అధికారులను, పోలీసులను వారు కోరారు. తాత్సారం ప్రదర్శించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే, సమస్య ముదిరి వివాదం చెలరేగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై శంకరపల్లి పోలీసులను, అక్కడే విలేకరులను అడిగితే ఎవరికి వారు తలో దిక్కున సమాచారం ఇస్తూ వాస్తవం దాస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుందని వారు విమర్శించారు.
ఈ విషయంలో యూనివర్సిటీ పెద్దలు వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కొరవడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా ఇక్ఫాయ్   యూనివర్సిటీలోని గొడవల వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ గదిలో ఒకే విద్యార్థి పై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేసిన వీడియోలు, అల్లాహు అక్బర్ అంటూ బలవంతంగా అనిపించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. కావాలంటే వాటిని పోలీసులకు అప్పజెప్తామని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

12 మందిపై పోలీసుల కేసు

మరోవంక, ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 12 మందిపై కేసు నమోదు చేసి,  ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్ పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
 
 ఓ జూనియర్ ను సీనియర్లు చితక బాదారు. రూమ్ లో డోర్ పెట్టి    అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తొలుత ఇరువురిని  రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి.  
 
 ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా,  నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ  కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్ తో  ర్యాగింగ్ కు పాల్పడిన  12 మందిపై శంకర్ పల్లి పోలీసులు  కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ  యాజమాన్యం  సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై  చర్యలు తీసుకునే అవకాశం ఉంది.