టీ20 ప్రపంచ కప్‌ విజేత ఇంగ్లండ్‌… చతికిలబడ్డ పాక్

ఈ ఏడాది టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ విజేత‌గా ఇంగ్లండ్ జ‌ట్టు నిలిచింది. ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన ఫైన‌ల్లోపాకిస్థాన్ జ‌ట్టు మీద ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. పాక్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది.
వన్డే ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. ఇంగ్లండ్ ఇప్పటికే 2019 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని మరోమారు విశ్వవిజేతగా అవతరించింది.
 
ఆల్‌రౌండ‌ర్‌ బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచ‌రీతో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.  అర్థ‌సెంచ‌రీతో చెల‌రేగి జ‌ట్టుని గెలిపించాడు. అత‌నికి మొయిన్ ఆలీ (13 బంతుల్లో 19 ప‌రుగులు) అండ‌గా నిలిచాడు. చెలరేగి ఆడి ఇంగ్లండ్ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. బెన్‌స్టోక్స్‌ విన్నింగ్ షాట్ కొట్ట‌డంతో ఇంగ్లండ్ డ‌గౌట్‌లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.
 
 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో కూడా న్యూజిలాండ్ మీద కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుని గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో14 ప‌రుగులు చేసి, సూపర్ ఓవ‌ర్‌కి తీసుకెళ్లాడు. సూప‌ర్ ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. దాంతో త‌మ జ‌ట్టు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ క‌లని బెన్‌స్టోక్స్‌ నెర‌వేర్చాడు.
 
 ఇంగ్లాండ్ బౌలర్లలో శ్యామ్ కురాన్ మూడు వికెట్లు, అదిల్ రషీద్ రెండు వికెట్లు తీసి పాక్ వెన్నువిరిచారు. ఇంగ్లాండ్ క్రీడాకారులు శ్యామ్ కరాన్, అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శ్యామ్ కరన్ వరించాయి.
 
మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 137 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ రిజ్వాన్ 15 ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. కెప్టెన్ బాబ‌ర్ ఆజం (32 ప‌రుగులు), మిడిల్ ఆర్డ‌ర్ బ్యాటర్ షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో, 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి పాకిస్థాన్ 137 ప‌రుగులు చేసింది కోల్పోయింది. 
 
షాన్ మ‌సూద్ 38 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ క‌ర్ర‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆదిల్ ర‌షీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్‌కి ఒక వికెట్ ద‌క్కింది.  ఫైన‌ల్లో గెల‌వ‌డంతో రెండోసారి టీ 20 ప్ర‌పంచ‌కప్ గెలిచిన జ‌ట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.
రెండు టీ20 ప్రపంచకప్‌లతో వెస్టిండీస్ సరసన చేరింది. 2010లో పాల్ కాలింగ్‌వుడ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు టీ20 ప్రపంచకప్ అందుకుంది. 2016 ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, విండీస్ బ్యాటర్ కార్లస్ బ్రాత్‌వైట్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.