ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సెమీస్‌కు భారత్‌

20టి ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. లీడ్‌లో ఉన్న సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమిండియా నేరుగా సెమీస్‌కు చేరింది.  మరో వంక, గ్రూప్‌2 నుంచి సెమీస్‌కు చేరేందుకు తున్నాయి. చెరో నాలుగు పాయింట్లు కలిగిన ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తలపడగా, బంగ్లాపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది గెలుపొందిన పాకిస్తాన్ కూడా సెమీస్ కు చేరుకుంది.

ఇవాళ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ ఆటగాళ్ ఆరంభం నుంచే అదరగొట్టారు. సఫారీల బౌలర్లను తట్టుకుని పరుగుల వేట మొదలుపెట్టారు. మైబర్గ్‌ (37), మ్యాక్స్‌ ఓడ్వడ్‌ (29 ), అక్రమన్‌ (41) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లుముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి నెదర్లాండ్స్‌ 158 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్‌ను పసికూనగా తక్కువ అంచనా వేసిన సౌతాఫ్రికా బొక్కబోర్లాపడింది. స్వల్ప టార్గెట్‌ను చేధించడంలో తడబడింది. డచ్‌ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో సఫారీలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది.

 ఫలితంగా 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై చిత్తుగా ఓడింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బ్రాండన్‌ గ్లోవర్‌ మూడు వికెట్లు, క్లాసిన్ డిలీడే, మీక్రెన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, సెమీస్‌ బెర్త్‌ కన్ఫార్మ్‌ చేసుకున్న టీమిండియా.. జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది.