‘లేపాక్షి’ పై హిందూపురంలో జాతీయ సదస్సు

ప్రఖ్యాతి గాంచిన లేపాక్షే వీరభద్రాలయ కట్టడాలు, శిల్పకళ, తైలవర్ణచిత్రాలకు ప్రపంచ వార సత్వ కట్టడాల జాబితా (యునెస్కో గుర్తింపు) లో శాశ్వతంగా చోటు దక్కడం కోసం డిసెంబర్ 14,15 తేదీల లేపాక్షిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు చరిత్రకారుడు, సదస్సు సంచాలకుడు మైనాస్వామి చెప్పారు. 
 
హిందూపురంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జాతీయ సదస్సు” లేపాక్షి వీరభద్రాలయ వైభవానికి ‘యునెస్కో’ శాశ్వత గుర్తింపు ఆవశ్యకత” అనే ప్రధాన అంశంపై జరుగుతుందని తెలిపారు.
 ఆంధ్రప్రదేశ పర్యాటక గమ్యస్థానం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయాల వైభోగం – అభివృద్ధి, లేపాక్షి వీరభద్రాలయ కట్టడాలు శిల్పకళా – తైల వర్ణ చిత్రాల శోభ, చారిత్రక కోటల పర్యాటక వలయాల అభివృద్ధి, ఎర్రగుడి – గుత్తి – పుట్టపర్తి పెనుకొండ – లేపాక్షి – హేమావతి లను కలుపుతూ బృహత్.. పర్యాటక వలయం ఏర్పాటు తదితర అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించడానికి ఆహ్వానిస్తున్నారు.
తెలుగు – ఇంగ్లీషు భాషల్లో 24 సైజులో 43 జీలకు మంచకుండా పరిశోధనా పత్రాలుండాలని చరిత్రకారుడు తెలిపారు. దేశంలోని పర్యాటక రంగ నిపుణులు, చరిత్రకారులు, పర్యాటక పాత్రికేయులు, రచయితలు, పురావస్తు పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు సుమారు 300 మంది వరకూ సదస్సులో పాల్గొంటారు.
పత్ర సమర్పకులకు ప్రశంసాపత్రాలను ఇస్తారు. పి.జి. కళాలలు, విశ్వవిద్యా ఆయాల్లోని విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోల వాలని మైనస్వామి విజ్ఞప్తి చేశారు. పరిశోధన పత్రాలను నవంబర్ 30 లోగా tourismnews2007@yahoo.co.in కు మెయిల్ చేయాలి. మరిన్ని వివరాలకు 9502659119 ను సంప్రదించవచ్చు.
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర, పర్యాటక విభాగాధిపతి ఆచార్య కొక్కొండ విజయబాబు నిర్వహణ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.