నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిరుమల్‌నగర్ కాలనీలో మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి ఆరు వాహనాల్లో వచ్చిన 20 మంది ఐటీ అధికారులు పెద్దఎత్తున సోదాలు, తనిఖీలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో మొత్తం రూ. 49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.
స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీజ్ చేశామని తెలిపారు. ఐటీ అధికారులు మంత్రి పీఏ నివాసానికి చేరుకున్న సమయంలో ప్రభాకర్‌రెడ్డి సతీమణి మాత్రమే ఉన్నారు. రాత్రి 8 గంటలకు ప్రభాకర్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు.
ఐటీ అధికారులు ఆయన నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దానికి ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ తాను వ్యవసాయం చేస్తానని, పంటపై వచ్చిన ఆదాయం ఆ మొత్తమని వివరణ ఇచ్చినట్లు సమాచారం. రెండ్రోజుల్లో ఐటీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సోదాల్లో నల్లగొండతోపాటు కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల ఐటీ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. నల్లగొండ టూటౌన్‌కు చెందిన సీఐ చంద్రశేఖర్, ఇద్దరు ఎస్సైలు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఐటీ అధికారుల వెంట వచ్చిన గన్‌మెన్, కేంద్ర రిజర్వ్ పోలీసులు వారిని వెనక్కి పంపారు. మీడియాను సైతం అనుమతించలేదు. రాత్రి 11.30కు ఐటీ అధికారులు సీలు వేసిన ఓ సూట్‌కేసు, ఒక కవర్‌ను వెంట తీసుకెళ్లారు.
మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తుండటం గమనార్హం. ఆయన 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎన్నికల కమీషన్ నిషేధం విధించడంతో రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభలో పాల్గొనలేక పోయారు.
More Stories
సైనిక వీరులకు వందనం చక్కటి చొరవ
ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి
శంషాబాద్ మండలంలోని ఆలయాలపై వరుసగా దాడులు