బిడెన్ నివాసంలో అతిపెద్ద దీపావళి సంబరాలు

దీపాల పర్వదినం దీపావళిని సరిహద్దును దాటి అనేక దేశాల్లో ప్రజలు జరుపుకొంటున్నారు. ఈ పండుగను భారతీయ మూలాలు ఉన్నా భారతీయులే కాకుండా భారతీయతతో సంబంధం లేని వారు కూడా జరుపుకుంటారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అన్ని తరగతుల మధ్య దీపావళి ప్రసిద్ధి చెందింది.
రాజకీయ నాయకులు సహితం ఈ సంబరాలు జరుపుకోవడంలో వెనుకబడటం లేదు.  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్ సోమవారం వైట్ హౌస్‌లో రంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు, జార్జ్ బుష్ పరిపాలనలో పీపుల్స్ హౌస్ పండుగను జరుపుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ జరిగిన అతిపెద్ద సంబరం అని చెప్పవచ్చు.
“ఈ పర్వదినాన మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణం. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్ నిర్వహించడం ఇదే తొలిసారి. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆసియా అమెరికన్లు మాకు అండగా ఉన్నారు. దీపావళి వేడుకను అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన భాగంగా చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము,” అంటూ బిడెన్ స్వాగతం పలికారు. 
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా దీపావళిని మెరుస్తున్న ‘ఫుల్జాదీ’ పట్టుకుని, ఈ కార్యక్రమంలో భారతీయ సంతతి వ్యక్తులతో నవ్వుల అలలు పంచుకోవడం కనిపించింది. ఈస్ట్ రూమ్‌లో జరిగిన రిసెప్షన్‌కు 200 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు,
అమెరికా, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఈ దీపాల పండుగను జరుపుకుంటున్న ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, దీపావళి వేడుకను ఆనందంగా జరిపినందుకు అమెరికాలోని ఆసియా అమెరికన్ సమాజానికి బిడెన్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ గది అణు ఒప్పందంపై సంతకం చేయడం, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 2008లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలసి సంయుక్తంగా విలేకరుల సమావేశం జరపడంతో సహా భారతదేశం-యుఎస్ సంబంధానికి సంబంధించిన కొన్ని మైలురాయి సంఘటనలకు సాక్షిగా నిలిచింది.

రిసెప్షన్‌లో సితార్ వాద్యకారుడు రిషబ్ శర్మ, డ్యాన్స్ ట్రూప్ ది సా డ్యాన్స్ కంపెనీ ప్రదర్శనలతో సహా కొన్ని ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చీర, లెహంగా, షేర్వాణి వంటి భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించిన అతిథులు కొన్ని నోరూరించే భారతీయ వంటకాలను ఆస్వాదించారు.

“ఈస్ట్ స్టేట్ డైనింగ్ రూమ్‌లో గది నిండిపోయింది… ఇది అమెరికాలో భారతీయ కమ్యూనిటీ సాధించిన విజయానికి నిజమైన వేడుక. దీపావళి రోజున మనందరికీ ఆతిథ్యం ఇవ్వడం అధ్యక్షుడు, వైట్ హౌస్ ద్వారా అద్భుతమైన గుర్తింపు”  అని అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు అతుల్ కేశప్ సంతోషం వ్యక్తం చేశారు.“దీపావళి జరుపుకోవడానికి ఇక్కడకు రావడం గౌరవం, విశేషం. దీనికి భారతీయ అమెరికన్లు అధ్యక్షుడు, ప్రథమ మహిళకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు” అని అమెరికాలోని అతిపెద్ద దక్షిణాసియా టెలివిజన్ ఛానెల్ టివి ఆసియా చైర్మన్ హెచ్ ఆర్ షా పేర్కొన్నారు.


“దీపావళి సందర్భంగా వైట్‌హౌస్‌లో మన చురుకైన భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకులు మంచి కోసం ఒక శక్తిగా రావడాన్ని చూడటం చాలా సంతోషాన్ని కలిగించింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునక్‌ను దీపావళి రోజున డీఐషుడు స్వాగతించడం కూడా చాలా ఆనందంగా ఉంది” అని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎం ఆర్ రంగస్వామి తెలిపారు.
ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయిలు, పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుడి సలహా సంఘం సభ్యుడు అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ, ఆర్థికాభివృద్ధిలో, కరోనా సంక్షోభం నిర్వహణలో దక్షిణాసియా సమాజం  సహకారాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు.  బిడెన్ పరిపాలనలోని వివిధ స్థాయిలలో రికార్డు స్థాయిలో 130 మంది ఇండో-అమెరికన్‌లను నియమించారని ఆయన ఆయన గుర్తు చేశారు.

“అమెరికా అంతటా ఉన్న అద్భుతమైన దక్షిణాసియా సమాజం ఈ మహమ్మారి నుండి దేశం బలంగా బయటపడటానికి సహాయపడింది.  ప్రతి ఒక్కరికీ పనిచేసే ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, పిల్లలకు బోధించడం, పెద్దలను చూసుకోవడం, వాతావరణంపై చర్య కోసం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడానికి కృషి చేయడం, రక్షించడం. హక్కులు , స్వేచ్ఛలు, మరింత న్యాయమైన, సమానమైన దేశాన్ని నిర్మించడం, మన కమ్యూనిటీలు, దేశానికి సేవ చేయడం, భద్రత కల్పించడం, వినోదం, స్ఫూర్తిదాయకం, ”అని బిడెన్ పేర్కొన్నారు.