టి20 ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ ఉత్కంఠ విజయం

మెల్‌బోర్న్‌ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్​ 2022లో  పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  కోట్లాదిమంది భారతీయుల్లో దీపావళి ముందే వచ్చిన సంతోషం. ఇంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరగడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే కావడం గమనార్హం.
తొలుత తడబాడుటుకు గురైనా ఆ తర్వాత విరాట్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా నిలదొక్కుకుని ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు.  పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని అఖరి ఓవర్లో  భారత్  ఛేదించింది. భారత్ బ్యాటర్లలో   రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) విఫలమైయినప్పటికీ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), హార్దిక్ పాండ్య (40)రాణించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. 
160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ ఒక దశలో ఓటమి దిశగా పయనించింది. అయితే కోహ్లీ, హార్దిక్ పాండ్యా క్రీజులో పాతుకుపోవడంతో లక్ష్యం కరిగిపోతూ వచ్చింది.ఈ మ్యాచ్‌లో కోహ్లీ అసలైన హీరోగా నిలిచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
పూర్తి ఒత్తిడిలోనూ ఏమాత్రం గతి తప్పకుండా ఆడి భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. 53 బంతులు ఎదర్కొన్న కోహ్లీ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 
 
చివరి ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది. 6 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాక్  చేసిన తప్పిదాలు భారత్ కు వరంగా  మారాయి. రెండు వైడ్స్, ఒక నో బాల్ తో పాక్ మ్యాచ్ ను చేజార్చుకుంది. పాండ్యా , దినేష్ కార్తీక్ ఔటైన కోహ్లీ చివరి వరకూ ఉండి జట్టును ఒంటి చేత్తో  గెలిపించాడు.
53 బంతుల్లో 82 రన్స్ చేసి ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భూజల పై ఎత్తుకుని  సంతోషంగా తిప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. సహచరులు కూడా కోహ్లీని  అభినందించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 159 రన్స్ చేసింది. పాక్ ప్లేయర్స్ తో మసూద్ 52, హమీద్ 51 రన్స్ తో రాణించారు. మొదట్లో వరుసగా వికెట్లు కొల్పోయినా, చివరిలో పాక్ బ్యాటర్స్ రెచ్చిపోయారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు,  హార్థిక్ పాండ్యా 3 వికెట్లు తీశారు.