భద్రాద్రి రాముల వారి అంగుళం భూమి కూడా వదులుకోము

రెండవ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి అంగుళం భూమి కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
శుక్రవారం హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని దర్శించుకుని, ఈవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడింది. దేవాలయ భూములు కబ్జాకు గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీరంతా ఏం చేస్తున్నారని నిలదీసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని దేవాలయ భూములు కబ్జా చేస్తున్నట్లు దేవాలయ అధికారులు పరిషత్ బృందానికి తెలియజేశారు.
తీర్పులు కూడా దేవాలయ భూమి గానీ గుర్తించిందని వందలకొద్దీ తీర్పులు కూడా వెల్లడించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆధారాలతో సహా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేవాలయ భూములను కాపాడుకుంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నందున దేవుడి మాన్యాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో భూములు ఉండటం, తెలంగాణలో మందిరము ఉండటం వల్ల భూముల కబ్జాకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని ఆరోపించారు. అన్ని ఆధారాలతో చట్టపరంగా దేవుడి మాన్యాలను కాపాడుకునే బాధ్యత ప్రతి హిందువుపై ఉందని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన దేవుడి భూములను మాత్రం అన్యాక్రాంతం కానివ్వమని హెచ్చరించారు.
1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం రాముల వారి భూములను సేవా ముసుగులో ఒక క్రైస్తవ సంస్థకు అప్పజెప్పింది. మొగిలి మరియమ్మ అనే క్రైస్తవురాలికి హిందూ దేవాలయ భూమిని ఎలా దారిద్రం చేసిందని విశ్వహిందూ పరిషత్ నేతలు నిలదీశారు. అప్పట్లో అడ్డదారిలో విడుదల చేసిన జీవోను విశ్వహిందూ పరిషత్ తప్పు పట్టింది.
సోమరాజు పురుషోత్తమ దాసు అన్ని రామభక్తుడు 1878లో 917 ఎకరాలు శ్రీరామచంద్రుల వారికి దానం చేశారు దీంతోనే ఆ ఊరికి పురుషోత్తమ పట్టణం అని పేరు వచ్చింది. కానీ ఆ భూములను నిజాం సర్కారు వద్ద కాము కొన్నట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 అయితే వాస్తవానికి భద్రాచలం ఏ రోజు కూడా వరంగల్ జిల్లాలో లేదు.  1971 వరకు భద్రాచలం ప్రాంతం మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో భద్రాచలం ప్రాంతాన్ని తూర్పుగోదావరి నుంచి వేరు చేస్తూ ఖమ్మం జిల్లాలో కలిపారు. కానీ వరంగల్ జిల్లాలో భద్రాచలం ఉన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం నేరం.
అదే నిజమైతే 2018 వరకు ఆ భూములపై భద్రాద్రి దేవాలయానికి రైతులు శిస్తు ఎందుకు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా సరైన భూములు కాపాడుకునేటందుకోసం భద్రాద్రి అస్తిత్వం కాపాడుకునేటందుకోసం విశ్వహిందూ పరిషత్ ఉద్యమిస్తుందని  పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, కార్యదర్శులు రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర సంయోజక్ శివ రాములు, సురేష్, వెంకటేష్ స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమ స్వరూపాన్ని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను బుల్డో జర్లతో కూల్చివేస్తామని హెచ్చరించారు.