జయలలితకు అందిన వైద్య చికిత్సలపై విచారణ కమిషన్ సందేహాలు

జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ ఇప్పటికే తన నివేదికను తమిళనాడు సర్కారుకి అందజేసింది. ఈ నివేదికలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా, ఆమె మరణించిన సమయం, జయలలితకు అందిన వైద్య చికిత్సలపై కమిషన్ సందేహాలు వ్యక్తం చేసింది.

అంతేకాకుండా జయలలిత నెచ్చెలి శశికళను విచారిస్తే ఈ వ్యవహాంలో అసలు విషయాలు వెలుగు చూస్తాయంటూ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. జయలలిత 2016 డిసెబర్ 5న మరణించినట్లు వైద్యులు చెబుతున్నా, తాము విచారించిన సాక్షుల మాట ప్రకారం ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ పేర్కొంది.

ఈ లెక్కన జయలలిత మరణించిన మరునాడు ఆమె మరణాన్ని ప్రకటించారని తెలిపింది. అయితే జయ మరణంపై అపోల్‌ హాస్పిటల్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ సరిగా లేదని కమిషన్‌ తన రిపోర్ట్‌లో తెలిపింది. అపోలో నివేదిక ప్రకారం 2016, డిసెంబర్‌ అయిదో తేదీన రాత్రి 11.30 నిమిషాలకు జయ ప్రాణాలు విడిచారు. జయ తుది శ్వాస విడిచిన 

అపోలో నివేదిక ప్రకారం 2016, డిసెంబర్‌ అయిదో తేదీన రాత్రి 11.30 నిమిషాలకు జయ ప్రాణాలు విడిచారు. జయ తుది శ్వాస విడిచిన సమయంపై వివాదం చెలరేగుతోంది. జయ మరణించిన సమయంపై అనుమానాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

అపోల్‌ హాస్పిటల్‌లో ఉన్న జయకు ఎయిమ్స్‌ వైద్యుల బృందం సరైన వైద్యం అందించలేదని కమిషన్‌ తన రిపోర్ట్‌లో తెలిపింది. జయలలిత మరణంపై 500 పేజీల నివేదికను సమర్పించింది. డాక్టర్లు సిఫారసు చేసినప్పటికీ జయలలితకు యాంజియోప్లాస్టీ ఎందుకు జరపలేదని, ఇంగ్లాండ్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ సూచించినప్పటికీ జయలలితను చికిత్స కోసం విదేశాలకు ఎందుకు విమానంలో తరలించలేదని కూడా కమిషన్ ప్రశ్నించింది.

చెన్నై అపోలో ఆసుపత్రి అందించిన చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేసింది. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్‌ సమీన్‌ శర్మ.. జయకు హార్ట్‌ సర్జరీ చేయాలని సూచించారు. కానీ ఆ సర్జరీ జరగలేదని రిపోర్ట్‌లో తెలిపారు.

శశికళ, డాక్టర్‌ కేఎస్‌ శివకుమార్‌, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌, ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్‌ తీరును కూడా అరుముగస్వామి కమిషన్‌ తప్పుపట్టింది.  జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన వైద్యుడు, జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శికుమార్, నాడు వైద్య, ఆరోగ్  శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.

జయ మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు పైన చెప్పిన వారందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి ఈ అనుమానలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారు.

జయలలిత సుదీర్ఘ కాలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై వివాదాస్పదన వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపించేందుకు  మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ను 2017లో ఏర్పాటు చేశారు.

ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 2021లో తమిళనాడులో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది.