నరబలిపై కేరళ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసిన కేరళలో జరిగిన పతనంతిట్ట నరబలి వ్యవహారంను జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్‌గా తీసుకున్నది. ఈ వ్యవహారంపై కేరళ చీఫ్‌ సెక్రెటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ స్థితి, బాధిత కుటుంబాలకు చెల్లించిన పరిహారం సహా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే ఈ కేసులో దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు (దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు జరుపుతున్నది. హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురి అరెస్టు చేశారు. సిట్‌ శనివారం ఇద్దరు నిందితులు భగవాల్‌ సింగ్‌, లైలా ఇంటికి చేరుకొని విచారించి, ఆధారాలు సేకరించింది. ప్రత్యేక జాగిలాలతో నిందితులిద్దరి ఇంటి నుంచి సిట్‌ కీలక ఆధారాలను సేకరించింది.

అంతకు ముందు పోలీసుల విచారణలో భగవాల్‌ సింగ్‌ కీలక సమాచారాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసుల వివరాల ప్రకారం  నిందితుడు భగవాల్‌ సింగ్‌ తనను తాను డాక్టర్‌గా చెప్పుకునేవాడు.అంతేకాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.

ప్రస్తుతం ఈ కేసులో నిందితులు ముగ్గురు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.  కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఇటీవల ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆర్థిక సహాయం పేరుతో మహిళలను కిడ్నాప్‌ చేసి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాలను ముక్కముక్కలు నరికి భూమిలో పాతిపెట్టారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో భగవల్‌ సింగ్‌ అతని భార్య లైలాతో పాటు ప్రధాన నిందితుడు మహ్మద్‌ షఫీ అరెస్టు చేయగా,  మృతులను పద్మ, రోస్లిన్‌గా గుర్తించారు.