జిన్‌పింగ్ ఆధిపత్యంతో ఎటువైపుకు చైనా!

చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అక్టోబర్ 16న ప్రారంభమవుతుంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని వరుసగా మూడోసారి ఐదేళ్ల పదవీ కాలానికి ఎన్నిక కాగలరని విస్తృతంగా భావిస్తున్నారు. 2012 నుండి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిన్‌పింగ్, వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ అధినేత కావడానికి సిద్ధంగా ఉన్నారు.
 
పార్టీ అనుసరిస్తున్న సమిష్టి నాయకత్వం, క్రమబద్ధమైన వారసత్వ వ్యవస్థ నుండి ప్రమాదకర నిష్క్రమణను ఇది సూచిస్తుంది. అంతేకాకుండా,  చైనా ప్రభుత్వం పలు జటిలమైన విదేశీ, స్వదేశీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, వాటిలో చాలా వాటికి జిన్‌పింగ్ అనుసరిస్తున్న విధానాలే కారణమైన నేపథ్యంలో ఆయన నాయకత్వం పట్ల పార్టీ తిరిగి నిబద్దత ప్రకటించబోవడం గమనార్హం.
 
చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఏకవ్యక్తి నిరంకుశ ఆధిపత్యంకు లొంగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఒకే వ్యక్తి అనుసరించే లోపభూయిష్ట విధానాలకు మొత్తం దేశం భారీ మూల్యం చెల్లించుకొనే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.
 
 2012లో కుంభకోణాలతో కూడిన చాంగ్‌కింగ్ పార్టీ కార్యదర్శి బో క్సిలై  అత్యాశ రాజకీయాల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జిన్‌పింగ్ పార్టీలో అంతర్గత క్రమశిక్షణను పునరుద్ధరించే కర్తవ్యం నేరుపవలసి వచ్చింది. అయితే, ఓ దశాబ్దం తర్వాత పార్టీలోని అసమ్మతి వర్గాలతో పాటు, 1.4 బిలియన్ పౌరులు ఇప్పుడు ఓ బలమైన నాయకుడి ఉక్కు పిడికిలి కింద శక్తిహీనంగా, నిసాహాయంతో చూస్తుండడం మరింత ఉన్నాయి.
 
మావో నిరంకుశ పాలన తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతం చేసుకోవడం పట్ల దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు వరకు సాధించిన విజయాలు అన్నింటిని వమ్ము చేసే ప్రయత్నంలో జిన్‌పింగ్ ఉన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.
 
అంతకు ముందు పాలకులు పరిమితంగా అయినా సహించిన పౌర సమాజ పౌర సమాజ కార్యకలాపాలు, చట్టబద్ధ పాలనలో సంస్కరణలు, సమాలోచనలు పక్రియను పూర్తిగా  జిన్‌పింగ్ కుదించడం కనిపిస్తుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడమ్ హౌస్ ప్రతి ఏడాది రూపొందించే `ప్రపంచ స్వతంత్రం’ సూచికలో చైనా స్థానం గతం దశాబ్దకాలంగా 17 నుండి 9కి పడిపోయింది. ఇటీవలనే,  జిన్‌పింగ్ ఆధ్వర్యంలోని సిసిపి హాంకాంగ్‌లో రాజకీయ స్వయంప్రతిపత్తి, మానవ హక్కులను కూల్చివేసింది,
 
 జిన్‌జియాంగ్‌లో మిలియన్ల మంది ముస్లింలపై దారుణమైన నేరాలకు పాల్పడ్డారు. ఒక వంక చైనా జనాభా క్షీణతను తిప్పికొట్టాలని మహిళలను కోరుతూ,  మరో వంక వారి హక్కులను అణచివేస్తున్నారు. ఆర్థిక పరంగా,  జిన్‌పింగ్ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి కఠినమైన, రాజకీయ ప్రేరేపిత నిబంధనలను విధిస్తున్నది.
 
దీర్ఘకాలికంగా రుణాల మద్దతుతో వృద్ధిని పోగు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కూలబడిపోయారు.  ఇప్పుడు చాలా మంది పౌరులకు వారి పొదుపులు కుప్పకూలి పోతుండడం,  క్రూరమైన కరోనా పరిమితులకు కట్టుబడి ఉండటం వలన వృద్ధికి మరింత హాని కలిగిస్తుంది. దానితో ప్రజల ఆగ్రహానికి దారి తీస్తుంది. 
 
 అంతర్జాతీయంగా, “తోడేలు యోధుడు” దౌత్యంతో  జిన్‌పింగ్   దూకుడు బ్రాండ్‌ను ప్రోత్సహించారు. దీనిలో చైనీస్ రాయబారులు స్థానిక విమర్శకులను దూషిస్తూ, వారిపై దాడులకు దిగుతూ ఉండడంతో పాటు  చైనాకు  సూపర్ పవర్ హోదా కోసం వత్తిడులు తీసుకు రావడం మొదలుపెట్టారు.  భారతదేశంతో సరిహద్దు వెంబడి, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధిలో చైనా సైనిక ఉన్మాదాన్ని చూస్తూనే ఉన్నాం. 
 
పౌరుగు దేశాలలో చైనా సృష్టిస్తున్న భయాందోళనల కారణంగా వారు అమెరికాకు సన్నిహితంగా జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి.  బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి ఖండంలో దురుద్దేశ్యాలతో, అవినీతితి కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను కొందరు స్థానిక నేతలను కలుకుపోతూ జిన్‌పింగ్ ప్రోత్సహిస్తున్నారు. దానితో  ఈ ప్రాజెక్ట్ తో ఎదురయ్యే ఆర్థిక, పర్యావరణ, జాతీయ భద్రతా సమస్యలు స్థానిక పౌరులలో ఆందోళనలు కలిగిస్తున్నాయి.
 అంతర్జాతీయ ప్రచారం, సెన్సార్‌షిప్, తప్పుడు సమాచారం వ్యాప్తికి సిసిపి అపారమైన వనరులను వెచ్చించినప్పటికీ, బీజింగ్ గ్లోబల్ మీడియా ప్రభావ ప్రయత్నాలపై ఇటీవలి ఫ్రీడమ్ హౌస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో చైనా పాలన పట్ల ప్రజలలో విముఖత పెరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
నీసం 30 దేశాలలో సిసిపి దుష్ప్రచారంకు వ్యతిరేకంగా జర్నలిస్టులు, పౌర సమూహాలు లేదా ప్రభుత్వాలు క్రియాశీలకంగా గళం వినిపిస్తున్నాయి. మరోవంక,  ప్రజాస్వామ్య ప్రభుత్వాలు , అంతర్జాతీయ వ్యాపారాలు తమ సరఫరా గొలుసులను చైనా నుండి దూరంగా మళ్లించడానికి కృషి చేస్తున్నాయి. ఈ పరిణామాలు చైనా ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తున్నాయి. 
 
 అణచివేతను తీవ్రతరం చేస్తున్నప్పటికీ, దేశీయ అసంతృప్తి సంకేతాలు కూడా గణనీయంగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ నుండి  సెప్టెంబరు 2022 మధ్య కాలంలో చైనా పౌరులు దాదాపు 600 నిరసనలు, అసమ్మతి బహిరంగంగా వ్యక్తం చేసినసందర్భాలను ఒక నివేదిక నమోదు చేసింది. దేశవ్యాప్తంగా విఫలమైన లేదా ఆలస్యమైన గృహనిర్మాణ ప్రాజెక్టులతో మూడవ వంతు నిరసనలు ముడిపడి ఉండటం గమనార్హం. 
 
 వందలాది మంది పాల్గొనే వారితో వీధి ప్రదర్శనలు, వందల వేల పోస్ట్‌లతో ఆన్‌లైన్ కదలికలతో సహా కఠినమైన మహమ్మారి నిబంధనలకు వ్యతిరేకంగా మూడు డజనుకు పైగా వేర్వేరు నిరసనలు వెలుగులోకి వచ్చాయి. తన దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తూనే అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటంలో  జిన్‌పింగ్ క్రమంగా ఒంటరివారవుతున్నట్లు పలు సూచనలు వెలువడుతున్నాయి. 
 
నిరంకుశ పాలకులందరూ భిన్నాభిప్రాయాలను అణచివేస్తారు. చివరికి మంచి సలహాలు, ఖచ్చితమైన సమాచారానికి ప్రాప్యతను కోల్పోతారు. ప్రజాస్వామ్య ఎన్నికలు లేనప్పుడు, తమకు తిరుగులేదనుకొనే ఊహాగానాలపై తమ చట్టబద్ధతను ఆధారం చేసుకుంటారు. అంటే ఏదైనా దిద్దుబాటు లేదా లోపాన్ని అంగీకరించడం పట్ల విముఖంగా ఉంటారు. నేడు చైనాలో ఇదే జరుగుతున్నది. 
 
2003లో అధికారం చేపట్టినప్పటి నుండి తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన వినాశకరమైన దండయాత్ర గురించి ఇటీవలి ఇంటర్వ్యూలో దిద్దుబాటు చర్యల సవాలును స్పష్టంగా అంగీకరించారు: “తరువాత ఏ నాయకుడూ కూడా తప్పు చేశామని చెప్పలేదు.  ఒక పొరపాటును ఎవ్వరు అంగీకరింపలేరు. అవును, నేను తప్పు చేశాను.. అని ఏ నాయకుడు చెప్పలేరు. నాయకులు ఓ మార్గాన్ని అనుసరింస్తున్నప్పుడు ఆ మార్గం నుండి మరోవైపుకు మరలడం చాలా కష్టం”. 
 
ఇప్పుడు జిన్‌పింగ్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. ఇటువంటి నాయకులు తామేమీ తప్పు చేయడం లేదని ఎంతగా చెప్పుకున్నప్పటికీ, మూడవ, నాల్గవ లేదా ఐదవ సారి పదవీకాలాన్ని పొడిగించుకోవాలని కోరుకొన్నప్పటికీ కనీసం తమ ఒక  వైఫల్యాన్ని కూడా అంగీకరింపలేదు. దిద్దుబాటు చర్యలు లోపించినప్పుడు ఎంతటి అసాధారణ వ్యవస్థలైనా మనుగడ సాగించడం సవాల్ తో కూడుకొన్న అంశమే కాగలదు.
 
అనుసరిస్తున్న విధానాలు ఎటువంటివైనా, దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ అధికారాన్ని కేంద్రీకరించడం, స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం కావించడం, వారసులు కాగలవారనుకొన్న వారిని నిర్ములించడం ద్వారా వారు నిర్మించుకునే సౌధాలు ఏమాత్రం పటిష్టంగా మనగలవో చరిత్రకే వదిలివేయాలి. 
 
ఎంతటి బలమైన నాయకులైనప్పటికీ జాతీయ ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలకు, ప్రజల అభ్యున్నతికన్నా అధికారాన్ని బలోపేతం చేసుకోవడం, తమ విధానాలపై – పనితీరుపై పారదర్శకతను, సమీక్షలను తిరస్కరిస్తూ చేసినంతకాలం వారి మనుగడ ప్రశ్నార్ధకరంగానే ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో మరో వారం రోజులలో జరుగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ కేవలం జిన్‌పింగ్ రాజకీయ భవిష్యత్ ను మాత్రమే కాకుండా చైనా రాజకీయ, ఆర్ధిక సుస్థిరతతో పాటు మానవాళి భవిష్యత్ పై కూడా నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది.
 
ఫ్రీడమ్ హౌస్ హెచ్చరిక 

“జీ జిన్‌పింగ్‌కు మూడవసారి పదవిని ఇవ్వడానికి దశాబ్దాల నాటి కాల పరిమితుల  సంప్రదాయాన్ని  చేయడం ద్వారా, చైనీస్ కమ్యూనిస్టు పార్టీ మావో జెడాంగ్ తర్వాత దాని అత్యంత నిరంకుశ నాయకుడిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కాంగ్రెస్ 
జిన్‌పింగ్‌   పట్టాభిషేకానికి సమానం” అంటూ అమెరికా కేంద్రంగా గల ఫ్రీడమ్ హౌస్ అధ్యక్షుడు మైఖేల్ జె. అబ్రమోవిట్జ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు.
అతని నాయకత్వాన్ని విస్తరించడంలో, సిసిపి  తన పెరుగుతున్న అణచివేత విధానాన్ని కూడా రెట్టింపు చేస్తుంది, ఇది చైనాలో రోజువారీ జీవితం, పాలన మరిన్ని అంశాలను నియంత్రించడం, స్వేచ్ఛను అణిచివేసేందుకు, అసమ్మతిని అణచివేయాలని కోరుకునే ఇతర అధికారవాదులకు ప్రపంచ నమూనాను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన  స్పష్టం చేశారు.
 
జిన్‌పింగ్‌ క్రూరమైన విధానాలు ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలోని పౌరులను ఒంటరిగా, అణచివేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.  జిన్‌పింగ్‌ పదవీకాలంలో సిపిపి విమర్శకులు, పాత్రికేయులు,  స్వతంత్ర మీడియాను క్రమపద్ధతిలో జైలులో పెట్టిందని,  నిశ్శబ్దం చేసిందని ఆయన తెలిపారు. 
 
సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు, చైనా వెలుపల ఇంటర్నెట్ యాక్సెస్, హక్కులపై దృష్టి సారించిన ఎన్జిఓ  లపై విరుచుకుపడిందని పేర్కొంటూ వ్యక్తిగత స్వయంప్రతిపత్తిపై తీవ్ర నియంత్రణలను సమర్థించేందుకు కరొనను ఆయన ఉదహరించారు. 
 
మతపరమైన ఆచారాలపై అణచివేత, బలవంతపు స్టెరిలైజేషన్లు, సామూహిక ఏకపక్ష నిర్బంధాలు, బలవంతపు అదృశ్యాలతో సహా ఉయ్ఘర్ జనాభా, ఇతర ముస్లిం మైనారిటీలపై దారుణమైన దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇక,  జిన్‌పింగ్‌  మూడవ పర్యాయం అధికారమలోకి రావడం చైనాలో మరిన్ని మానవ హక్కుల ఉల్లంఘనలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అతని దేశీయ, విదేశాంగ విధానాలు ఎదురుదెబ్బలు, ప్రజల ఆగ్రహాన్ని తీవ్రతరం చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వాక్ స్వాతంత్య్రాన్ని మరింత దూకుడుగా అణిచివేస్తుందని పేర్కొన్నారు.  జిన్‌పింగ్‌ మరో ఐదు సంవత్సరాల నాయకత్వం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు దుర్వార్తగా అభివర్ణించారు.  పైగా, చైనీస్ ప్రజలకు అధ్వాన్నమైన వార్త అని స్పష్టం చేశారు.