కాబుల్ లో భారీ పేలుడు… 100  మంది విద్యార్థుల మృతి!

ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించింది. విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ రాస్తుండ‌గా ఈ పేలుడు సంభ‌వించిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ల‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ ట్వీట్ చేశారు. 
 
భారీ పేలుడు నేప‌థ్యంలో 100 మంది విద్యార్థులు చ‌నిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. క్లాస్ రూమ్ మొత్తం ర‌క్తంతో నిండిపోయింది. యూనివ‌ర్సిటీ ఎంట్రెన్స్ మాక్ టెస్టు రాస్తుండ‌గా పేలుడు సంభ‌వించిన‌ట్లు జ‌ర్న‌లిస్టు పేర్కొన్నాడు. విద్యార్థుల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని తెలిపాడు. 
పశ్చిమ కాబూల్‌లోని దష్తే బార్చెను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్  ఉగ్రవాదులు నిత్యం ఇక్కడ మారణహోమానికి తెగబడుతూ ఉంటారు. విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్రవాది క్లాసురూములోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
 
హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఆ స్ట‌డీ సెంట‌ర్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు భావిస్తున్నారు. గ‌తంలోనూ ఆ వ‌ర్గంపై దాడులు జ‌రిగాయి. అయితే ప్ర‌స్తుత దాడికి బాధ్య‌త ఎవ‌రూ ప్ర‌క‌టించుకోలేదు. హజారాలు ఆఫ్ఘనిస్తాన్ లో మూడవ అతిపెద్ద జాతి సమూహం.
 
ఆఫ్ఘనిస్తాన్‌కు యుఎస్ మిషన్‌లో ఛార్జ్ డి అఫైర్స్, కరెన్ డెక్కర్ ఒక ట్వీట్‌లో, “కాజ్ ఉన్నత విద్యా కేంద్రంపై ఈరోజు జరిగిన దాడిని యుఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో నిండిన గదిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు; విద్యార్థులందరూ చేయగలగాలి ప్రశాంతంగా & భయం లేకుండా విద్యను అభ్యసించండి” అని పేర్కొన్నారు.