సీడీఎస్​గా జనరల్​ అనిల్​ చౌహాన్​ బాధ్యతల స్వీకరణ

భారత త్రివిధ దళాధిపతిగా లెఫ్టినెంట్​ జనరల్​ అనిల్​ చౌహాన్​ శుక్రవారం  బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి ఆయ‌న సీడీఎస్ ఆఫీసుకు వ‌చ్చారుభారత రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా చౌహాన్ (61) నియమితులయ్యారు.  డిసెంబర్ 2021లో మొదటి  సీడీఎస్  జనరల్ బిపిన్ రావత్ చనిపోయినప్పటి నుంచి ఈ పోస్ట్ తొమ్మిది నెలలకు పైగా ఖాళీగా ఉంది.
 
 సీడీఎస్‌గా తన మొదటి ప్రసంగంలో భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి అంచనాలను నెరవేరుస్తానని, అన్ని సవాళ్లు, ఇబ్బందులను కలిసి పరిష్కరించుకుందామని  ఆయన హామీ ఇచ్చారు. సీడీఎస్ చౌహాన్ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించే ముందు సౌత్ బ్లాక్ లాన్‌లపై ట్రై-సర్వీస్ గార్డ్ ఆఫ్ హానర్‌ను తనిఖీ చేశారు. 
 
అనంతరం సౌత్ బ్లాక్ కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. భారత సాయుధ బలగాలలో అత్యున్నత ర్యాంక్ బాధ్యతలు స్వీకరించినందుకు గర్విస్తున్నాని, చీఫ్​ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా త్రివిధ రక్షణ దళాల నుంచి అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు​.
ఇక ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్. ఘోరమాడే.. ఎయిర్ మార్షల్ బి.ఆర్. కృష్ణ కూడా హాజరయ్యారు.

c

అనిల్ చౌహాన్ ఆర్మీలో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా మండలి సలహాదారుడిగా కొనసాగుతున్నారు.