
భారత్ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ విరుచుకుపడ్డారు. ప్రతిష్టాత్మకమైన వాషింగ్టన్ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు.
అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికన్ మీడియాకు హితబోధ చేశారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వారిని మనం విద్యావంతులను చేయాలి’’ అని అమెరికన్ మీడియాను ఉద్దేశించి మంత్రి చెప్పారు.
అమెరికాలో భారత్ వ్యతిరేక శక్తులు పెరుగుతుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, ”ఇక్కడ వివక్ష లేదా పక్షపాత ధోరణులు ఉన్నాయన్నది నా ప్రధానమైన పాయింట్. భారతదేశానికి సంరక్షకులమని కొంతమంది భావిస్తుంటారు. కానీ వారికి భారత ప్రజల హృదయాల్లో చోటు వుండదు. అందువల్ల వారు బయట నుండి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటువంటి గ్రూపులు భారత్‌లో విజయం సాధించలేవని స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యపై అమెరికాలో జరుగుతున్న చర్చను కూడా ఆయన ప్రస్తావించారు. ‘ప్రజల ప్రాణాలు పోవడం కన్నా ఇంటర్‌నెట్ పోవడం మరింత ప్రమాదకరమని మాట్లాడుకునే దశకువచ్చారు. ఇక అటువంటపుడు నేను చెప్పేదేముంది?” అని ఎద్దేవా చేశారు.
కాగా, ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్‌తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతుగా ఎఫ్-16 విమానాల ఒప్ పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని స్పష్టం చేశారు. పందం చేసుకున్నామని అమెరికా రక్షణ శాఖ పేర్కొనడాన్ని కొట్టిపారవేస్తూ ఇలాంటివి చెప్పి ఇక్కడెవర్నీ ఫూల్స్‌ను చేయలేరని పేర్కొన్నారు.
More Stories
క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు