సీషెల్స్‌లో అడుగుపెట్టిన ఐఎన్‌ఎస్ సునయన

ఆపరేషన్ సదరన్ రెడినెస్ ఆఫ్ కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ (సీఎంఎఫ్‌)లో వార్శిక శిక్షణా విన్యాసాల‌లో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ సునయన 24 సెప్టెంబరు 2022న పోర్ట్ విక్టోరియా ద్వారా సీషెల్స్‌లోకి అడుగుపెట్టింది.

ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర భద్రతలో భారత నావికాదళం యొక్క నిబద్ధతను బలపరచడమే కాకుండా.. సీఎంఎఫ్ విన్యాసాల‌లో భారత నౌకాదళ నౌక తొలిసారిగా పాల్గొనడానికి ప్ర‌తీక‌గా నిలుస్తుంది. సీఎంఎఫ్  నిర్వహిస్తున్న సామ‌ర్థ్య పెంపు శిక్ష‌ణా విన్యాసాల‌కు భార‌త ద‌ళం భాగ‌స్వామిగా పాల్గొనాల్సి ఉంది.

సంయుక్త శిక్షణా విన్యాసాల‌లో అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలనుండి సిబ్బంది ప్రతినిధి బృందాలుగాను మరియు బ్రిట‌న్‌, స్పెయిన్ మ‌రియు భారతదేశం షిప్ భాగస్వాములుగా పాల్గొంటున్నాయి.  సున‌య‌న పోర్ట్ కాల్ సమయంలో ఈ విన్యాసాల‌లో పాల్గొనే దేశాలతో వృత్తిపరమైన పరస్పర చర్యలు రూప‌క‌ల్ప‌న‌ చేశారు.