
ఘటన సమయంలో పుతిన్ కాన్వాయ్‌లోని తొలి ఎస్కార్ట్ కారుకు అంబులెన్స్ అడ్డుగా వచ్చిందట. రెండో ఎస్కార్ట్ కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు పేర్కొంది.ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినట్లు సమాచారం.
అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతలో రాజీ పడినందుకు పుతిన్ సెక్యురిటీ సర్వీస్‌కు చెందిన పలువురు అధికారులను అరెస్టు చేసినట్లు ఆ ఛానల్ తెలిపింది. అధ్యక్షుడి బాడీగార్డ్ సర్వీస్ హెడ్ సహా పలువురు ఉన్నత అధికారులను సస్పెండ్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొంది.
కాగా, కొన్ని నెలల క్రితం క్రితం కూడా పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచిందని పేర్కొంది. ఇంకోవైపు 2017లో పుతిన్ మాట్లాడుతూ తనపై ఇప్పటి వరకు ఐదు సార్లు హత్యాయత్నాలు జరిగాయని, అయినా తాను ఆందోళన చెందబోనని చెప్పారు.
More Stories
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం