భారత్ పాడి రంగానికి చిన్న రైతులు చోదక శక్తి

ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఇతర దేశాల కు భిన్నంగా భారతదేశంలో పాడి రంగానికి చిన్న రైతులు చోదక శక్తి గా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ వరల్డ్ డెయిరి సమిట్ (ఐడిఎఫ్ డబ్లుడిఎస్) 2022ను గ్రేటర్ నోయిడా లోని ఇండియా ఎక్స్ పో సెంటర్ ఎండ్ మార్ట్ లో ప్రారంభిస్తూ  భారతదేశంలో పాడి రంగం ‘‘అధికోత్పత్తి’’ కంటే కూడా ‘‘సామాన్య ప్రజానీకం ద్వారా ఉత్పత్తి’’ అనే వర్ణన ను కలిగివుందని చెప్పారు. 

ఒకటి, రెండు లేదా మూడు పశువుల ను మాత్రమే కలిగి ఉన్నటువంటి ఈ చిన్న రైతు ల ప్రయాసల ప్రాతిపదికన భారతదేశం పాల ఉత్పత్తిలో అతి పెద్ద దేశం గా నిలచిందని చెబుతూ  ఈ రంగం 8 కోట్ల కు పైచిలుకు కుటుంబాలకు బ్రతుకుతెరువు ను అందిస్తోందని ఆయన తెలిపారు.

 పాడి రంగంలోని అవకాశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా, ప్రపంచం అంతటా కోట్ల కొద్దీ వ్యక్తులకు ఒక ప్రధానమైనటువంటి జీవనోపాధి వనరుగా కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. భారతదేశంలో పాడి సహకార సంఘాల నెట్ వర్క్ ఎంత భారీది అంటే అటువంటి ఒక ఉదాహరణ ను యావత్తు ప్రపంచం లో మరెక్కడా చూడజాలరు అని ప్రధాని స్పష్టం చేశారు. 

 ఈ పాడి సహకార సంఘాలు దేశం లో రెండు లక్షలకు పైగా పల్లెలలో, దాదాపుగా రెండు కోట్ల మంది రైతుల వద్ద నుండి రోజుకు రెండు సార్లు వంతు న పాలను సేకరించి వినియోగదారుల కు అందిస్తున్నాయని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఈ యావత్తు ప్రక్రియ లో ఎటువంటి మధ్యవర్తి ఉండరని, వినియోగదారుల వద్ద నుండి అందిన డబ్బులో 70 శాతానికి పైగా డబ్బు నేరుగా రైతుల జేబులలోకి వెళ్తోందని సభికుల దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వచ్చారు. 

భారతదేశంలో పాడి రంగం లో నిమగ్నమై ఉన్న శ్రమికులలో 70 శాతం మహిళలు ఉన్నారని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘మహిళ లు భారతదేశం పాడి రంగంలో నిజమైన నేతలు, ఇది ఒక్కటే కాదు, భారతదేశంలోని డెయరి కోఆపరేటివ్స్ లో మూడో వంతు కు పైచిలుకు సభ్యులు గా ఉన్నది కూడా మహిళ లే’’ అని ఆయన వివరించారు. 

ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన పాడి రంగం వరి, గోధుమల సంయుక్త విలువ కంటే కూడా అధికం గా ఉందని ఆయన చెప్పారు. దీనికి అంతటికీ భారతదేశంలోని నారీ శక్తి చోదకంగా ఉందని ఆయన తెలిపారు. భారతదేశంలో పాడిరంగంలో అవకాశాలను అధికం చేయడం కోసం ప్రభుత్వం 2014వ సంవత్సరం నాటి నుండి పట్టు విడువక కృషి చేసింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 

‘‘భారతదేశం 2014లో 146 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రస్తుతం 210 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే పెరుగుదల దాదాపు 44 శాతం మేరకు ఉందన్న మాట’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచం స్థాయిలో 2 శాతం ఉత్పత్తి వృద్ధి తో పోల్చి చూసినప్పుడు భారతదేశం 6 శాతానికి పైచిలుకు పాల ఉత్పత్తి తాలూకు వృద్ధి రేటు ను నమోదు చేస్తున్నదని కూడా ఆయన పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ‘‘పశువుల కు బయోమీట్రిక్ గుర్తింపు ను మేం అమలు పరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి పశు ఆధార్ అనే పేరు ను పెట్టాం’’ అని తెలిపారు. పశుగణం రంగం లో అన్ని కార్యకలాపాల ను గమనించడం కోసం ఒక డిజిటల్ సిస్టమ్ ను రూపొదించే పనిలో భారతదేశం ఉన్నదని చెబుతూ డిజిటల్ సిస్టమ్ ఈ రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వం తో అందించ కలుగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.