ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి శివైక్యం

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99 ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని  శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. షిర్డీ సాయిబాబాను “దేవునిగా మార్చడాన్ని” ప్రశ్నించిన ఆయన ద్వారకా-శారదా పీఠం (గుజరాత్‌లో) శంకరాచార్యగా, జ్యోతిష్ పీఠం (ఉత్తరాఖండ్‌లో) అధిపతిగా  ఉన్న స్వామి స్వరూపానందకు ఏడాది కాలంగా ఆరోగ్యం బాగుండటం లేదు.
దేశంలోని నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటైన ద్వారకా శారదా పీఠానికి చెందిన ఆయన జ్యోతిష్య పండితులు. దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు.  స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలోని దిఘేరీ గ్రామంలో జన్మించారు.
తొమ్మిదేళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయిన ఆయన ధర్మప్రచారం చేశారు. ఈ సమయంలో, అతను ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి కూడా చేరుకున్నాడు.  ఇక్కడ అతను బ్రహ్మలిన్ స్వామి కర్పాత్రి మహారాజ్ వేద-వేదాంగం, గ్రంథాలను నేర్చుకున్నాడు. 1942వ సంవత్సరంలో కేవలం 19 ఏళ్ల వయసులో విప్లవ సన్యాసిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ వారి నుంచి దేశంలో స్వాతంత్య్ర పోరాటం సాగుతోంది.
19 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్లోని ఓ జైలులో గడిపారు. 1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు.
 2018లో బృందావనంలో తమ 95వ జన్మదినం జరుపుకోగా, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు. 99వ ఏట అడుగుపెట్టిన ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
 ఇటీవల సెప్టెంబర్ 3న ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకున్నారు. రామ మందిర నిర్మాణం కోసం శంకరాచార్య సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు.  స్వరూపానంద సరస్వతి హిందువులలో గొప్ప ధార్మిక నాయకుడిగా ప్రసిద్దిచెందారు.  జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  స్వరూపానంద సరస్వతి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.