శ్రీ సిటీని సందర్శించిన పంజాబ్ మీడియా బృందం

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం కింద, భారతదేశపు సాంస్కృతిక చైతన్యాన్ని జరుపుకోవడాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా జాతీయవాదం, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ఇది మరింత సమర్థవంతంగా ఉపకరిస్తుందన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. 

ఇందులో భాగంగా పంజాబ్‌కు చెందిన 15 మంది జర్నలిస్టుల బృందం శ్రీ సిటీని సందర్శించింది. మీడియా & పబ్లిక్ రిలేషన్స్ హెడ్ సి రవీంద్రనాథ్  వ్యాపార రంగం యొక్క ప్రత్యేక లక్షణాలపై,  వాటిని అనుసరిస్తూ శ్రీ సిటీ ఎలా సమర్థంగా నిలుస్తుందో వారికి సవివరంగా వివరించారు. 

విభిన్న రంగాలలో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం ముఖ్య ఉద్దేశ్యం, ఎగుమతులను గణనీయంగా పెంచడం ద్వారా దిగుమతులను ప్రత్యామ్నాయం చేస్తూ ఆ ప్రచారానికి ఎలా సహకరిస్తుందో ప్రస్ఫుటంగా ఉందని సందర్శకులకు వివరించారు. ఈ కారణంగానే శ్రీ సిటీ ఆగమనం తర్వాత పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన అదే ప్రాంతం ఇప్పుడు ఆర్థిక శక్తి గల ప్రాంతంగా ఎలా మెరుగుపడిందనేది వివరించారు.

అక్కడ జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలను వారు సందర్శిస్తూనే వారు వెర్మెరియన్ ఇండియా రీహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  ఉత్పాదక యూనిట్‌ని సైతం సందర్శించారు. ఇది బెల్జియం- ఆధారిత వెర్మీరెన్ గ్రూప్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. వీల్‌చైర్లు, హాస్పిటల్ బెడ్‌లు, షెల్ కుర్చీలు, కంఫర్ట్ కుర్చీలు, ఇతర పునరావాస పరికరాలు అనుబంధ ఉత్పత్తులను ఇది తయారు చేస్తుంది. 

ఈ క్రమంలోనే మీడియా సభ్యులంతా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్  సయ్యద్ రియాజ్ ఖాద్రీతో సంభాషించారు. ప్రపంచవ్యాప్తంగా వాటి ఎగుమతి కోసం అవసరం అయ్యే వివిధ ఉత్పత్తులు, వాటికి గల డిమాండ్‌.. వంటి అంశాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

 హిందుస్థాన్ టైమ్స్‌కి చెందిన శ్రీమతి అనీషా సరీన్ ” – మా సందర్శనలో శ్రీ సిటీ ఒక చక్కని అనుభవం. దీనిలో ప్రత్యేక ఆర్థిక మండలి ఎలా ఉంటుందో, ఏ విధంగా పని చేస్తుందో మేము ప్రత్యక్షంగా తెలుసుకున్నాము. అలాగే, వివిధ దేశాలకు చెందిన 200 కంపెనీలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకున్నాము” అని చెప్పారు. 

విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌  సందర్శించడంతో పర్యటన ప్రారంభించిన ఈ బృందం విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి జి హెచ్ వి  కుమారితో. ప్రజల సహకారంతో మునిసిపల్ కార్పొరేషన్ విజయవంతంగా సముద్ర తీరాలను, పరిశుభ్రంగా  చెత్త రహితంగా ఉంచడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులను విజయవంతంగా నిలిపివేయడం గురించి తెలుసుకున్నారు.

పాడేరులో ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపాల కృష్ణ రోణంకితో జర్నలిస్టుల బృందం మాట్లాడింది. గిరిజనులకు వారి స్వంత నివాస ప్రాంతాలలో మెరుగైన జీవనం అందించడానికి నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు. వారికి జీవనోపాధి కల్పించడంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. .

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన కొత్త ప్రాజెక్టుల గురించి కూడా జర్నలిస్టులకు వివరించారు. ఈ బృందం కొండపల్లి గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర అవార్డు గ్రహీత కళాకారుడు కె. వెంకటాచారి కుటుంబాన్ని కలిసి కొండపల్లి బొమ్మల మూలాన్ని తెలుసుకుంది.