15 నుంచి నెల్లూరులో రెండో విడత ‘అగ్నిపథ్’ నియామకాలు 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్‌ నియామకాలు ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఏపీలో రెండో దశ ఎంపిక ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఆగస్టు 15 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగిసింది. 

శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్‌ జిల్లా వరకు 13 జిల్లాలకు చెందిన అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ విశాఖపట్నంలో కొనసాగింది. ఇక మిగిలిన 13 జిల్లాల ఎంపిక రెండో దశలో భాగంగా నెల్లూరు ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 15 నుంచి 26 వరకు ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ ర్యాలీ జరగనుందని ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ అధికారి కల్నల్‌ ఎస్‌ కోహ్లీ తెలిపారు.

ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ ర్యాలీని సజావుగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నారని చెప్పారు. ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ ర్యాలీ నేపధ్యంలో ముందస్తు ఏర్పాట్లపై నెల్లూరు నగర పాలక సంస్ధ కమిషనర్‌ హరిత, ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ అధికారి కల్నల్‌ ఎస్‌. కోహ్లితో కలసి శనివారం ఉదయం ఏ.సి.స్టేడియంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశ మయ్యారు.

ఈ ర్యాలీకి సుమారు 38 వేల మంది అభ్యర్ధులు ఆన్‌ లైన్‌ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకు 3 వేల మంది ఈ ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ ర్యాలీకు హాజరుకానున్నారు. దీనికి తగిన విధంగా రిక్రూ-టె-్మంట్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నారు.

ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ అధికారుల సూచనల మేరకు బ్యారీకేడింగ్‌, లైటింగ్‌, పబ్లిక్‌ అడ్రెస్‌ సిస్టమ్‌, పోలీసు బందోబస్తు, శానిటేషన్‌, మెడికల్‌ క్యాంపు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ ప్రక్రియకు సంబంధించి స్టేడియంలో శాఖల వారీగా చేపట్టాల్సిన విధులను ఆర్మీ రిక్రూ-టె-్మంట్‌ అధికారి కల్నల్‌ ఎస్‌.కోహ్లి అధికారులకు సూచించారు.