రూ 8 కోట్ల విలువైన 80 లక్షల విదేశీ సిగరెట్ల స్వాధీనం

విజయవాడ నగరంలో విదేశీ బ్రాండ్ విదేశీ సిగరెట్ల భారీ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. రెండు లారీల్లో దాచి  తీసుకెళ్ళుతుడగా విజయవాడ కస్టమ్స్ మిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు స్మగ్లింగ్ విషయాన్ని గుర్తించి, నిఘా ఉంచారు.
ఆపై తెల్లవారుజామున అనుమానాస్పదంగా తమిళనాడు రిజిస్ట్రేషన్ తో లారీ వస్తుండగా అడ్డగించారు. కేసర్పల్లి, విజయవాడ  విశాఖపట్నం జాతీయ రహదారిపై ఇలాంటి సమాచారానే  స్వీకరించిన తర్వాత ఇదే పద్ధతిలో ఇంటెలిజెన్స్‌ విభాగపు  మరో బృందం విజయవాడ హైదరాబాద్‌ మార్గంలో  వెళ్తున్న  బీహార్‌ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న లారీని  కూడా తనిఖీలకు అడ్డగించారు.
తనిఖీలో, రెండు వాహనాలు ఒక్కొక్కటి 134 హై-డెన్సిటీ పాలిథిలిన్ తో లోడ్ అయ్యి ఉండగా,  వాటిలో స్మగ్లింగ్ వస్తువులు పెట్టి కుట్టిన

బస్తాలు ఉన్నాయి. డ్రైవర్లను విచారించగా లోడ్ అయిన వాహనాలు బీహార్‌లోని పాట్నా నుండి బయలు దేరాయని వారు  వెల్లడించారు.
బుకింగ్ ఏజెంట్ సూచనల మేరకు విజయవాడ బయలు దేరామని,  బట్వాడా కోసం ఉంచిన  ప్యాకేజీల లోపలి వస్తువుల వివరాలు   తమకు తెలియదని పేర్కొన్నారు . అడ్డగించిన లారీల తనిఖీల ఫలితంగా 80,40,000 విదేశీ బ్రాండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. 804 డబ్బాలలో పట్టుబడిన సిగరెట్‌ విలువ సుమారు రూ. 8 కోట్లని అంచనా వేశారు.
 విదేశీ సిగరెట్లను స్మగ్లింగ్ చేయడం లాభదాయకమైన వ్యాపారం. బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు  కస్టమ్స్ కన్నుగప్పి అమ్మడం  వలన భారీ లాభం పొందే అవకాశం ఉంటుంది.  స్మగ్లింగ్ సిగరెట్లపై తప్పనిసరి చిత్ర హెచ్చరికలు ఉండవు, కస్టమ్స్ చట్టం, 1962  పొగాకు ఉత్పత్తుల నిబంధనల ప్రకారం, వీటి నియంత్రణకై హెచ్చరికలు తప్పనిసరి.
విజయవాడలో 2014లో ఈ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్గ్లింగ్ వస్తువుల విలువలే ఇవే అత్యధికం  కావడం గమనార్హం.