రాహుల్ `చౌకీదార్’ ప్రచారంపై మండిపడ్డ ఆజాద్ 

2019లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన “చౌకీదార్ చోర్ హై” ప్రచారం చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు అసంతృప్తికి గురిచేసిందని, గత వారం ఆ పార్టీని వీడినఆ సీనియర్  గులాం నబీ ఆజాద్ తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మొదటిసారిగా మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి, బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
తాను రాజీనామా చేసిన కాంగ్రెస్ మారథాన్ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పార్టీలోని సీనియర్ల ప్రతిఘటన కారణంగా తాను పనిచేయడం అసాధ్యంగా మారిందని చెప్పారని తెలిపారు. అతను తన “చౌకీదార్ చోర్ హై” ప్రచారాన్ని ఉదాహరణగా చూపుతూ దానికి ఎవరూ మద్దతు ఇవ్వలేదని వాపోయారని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా తన నినాదాన్ని ఉపయోగించిన  వారిని చేతులు ఎత్తమని రాహుల్ గాంధీ కోరారని, ఆ సమయంలో మన్మోహన్ సింగ్, ఎకె ఆంటోనీ, పి చిదంబరం వంటి సీనియర్లు అక్కడే ఉన్నారని ఆజాద్ తెలిపారు.
“అందరూ చేతులెత్తేసారు – చౌకీదార్ చోర్ హై అన్నవారు. నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టారు. చాలా మంది సీనియర్లు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావుతో మంత్రులుగా పనిచేసిన వారు – మీరు ఎలా ఆశిస్తున్నారు? ఈ భాషని బహిరంగంగా మాట్లాడాలా? మనం ఎవరినైనా ఎంత తీవ్రంగానైనా వ్యతిరేకించవచ్చు కానీ వ్యక్తిగతంగా దాడి చేయకూడదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తనలాంటి రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడికి దిగడం ఊహించలేమని ఆజాద్ స్పష్టం చేశారు.  “మేము ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ విద్యను పొందాము. నేను జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు, ఆమె ఎంఎల్ ఫోతేదార్‌కు, నాకు ఫోన్ చేసి, అటల్ బిహారీ వాజ్‌పేయిని కలవాలని చెప్పారు. నాయకుడికి, నాయకుడికి మధ్య ఉన్న తేడా చూడండి. అటల్జీ కూడా రాజకీయవేత్త అని, ఆయన కూడా ప్రజలకు సంబంధించిన పనులు జరగాలని చూస్తారని, అయితే తనతో మాట్లాడటానికి సంకోచిస్తారు  కాబట్టి మీరు అతనిని అడగండి” అని ఆమె చెప్పేవారని ఆజాద్ గుర్తు చేసుకున్నారు.
“కాబట్టి మేము మా పెద్దలను గౌరవించే, ప్రతిపక్ష నాయకులకు సమానంగా గౌరవించే విద్యను నేర్చుకున్నాము. మాకు పీఎం చోర్ హై అంటూ నినాదాలు ఇవ్వడం  నేర్పలేదు” అంటూ రాహుల్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.  “మోదీపై ఎంత తీవ్రంగా అయినా దాడి చేయవచ్చు, కానీ మేము ఇలా వ్యక్తిగతంగా వెళ్లలేము? సీనియర్ క్యాబినెట్ మంత్రులు ఉపయోగించాల్సిన భాష ఇదేనా?” అంటూ ప్రశ్నించారు.
తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై చేసిన తీవ్రమైన విమర్శలలో ఒకటి  2013 ఆర్డినెన్సును పూర్తిగా బహిరంగంగా చింపివేయడం. ఆజాద్ దానిని చిన్నపిల్లల ప్రవర్తన, అతని అపరిపక్వతకు స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. “ఈ చర్య ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్), మొత్తం మంత్రివర్గం  అధికారాన్ని దెబ్బతీసింది. ఆర్డినెన్స్‌లు ఎలా జారీ చేస్తారో రాహుల్‌కు ఈ రోజు వరకు తెలియదో లేదో నాకు తెలియదు. ప్రభుత్వాధినేత, దేశాధినేత నాయకత్వంలో దేనినైనా ఆమోదిస్తారు” అంటూ వివరించారు.
“రాహుల్ గాంధీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు లేదా అతని సెక్యూరిటీ గార్డులు, పీఏలు (వ్యక్తిగత సహాయకులు) కంటే దారుణంగా ఉంటారు” అని రాజీనామా లేఖలో చేసిన తన ఆరోపణపై ఆజాద్ స్పందిస్తూ “నా దగ్గర రుజువు ఉంది. అతను ఎలాంటి నాయకుడు అవుతాడని వారిని అడిగాడు. …కాంగ్రెస్ పార్టీలో వాళ్లు ఎవరో అందరికీ తెలుసు, ఎవరి ద్వారా రాహుల్ గాంధీకి చేరుకుంటారో..” అంటూ ఎద్దేవా చేశారు.
సోనియాకు అంతా తెలుసు 
సోనియాగాంధీకి తన కొడుకు ఏం చేస్తున్నాడో అంతా తెలుసని, అయితే ఆమె పూర్తిగా అతనిపైనే ఆధారపడి ఉన్నారని ఆజాద్ తెలిపారు. “అమ్మలందరూ ఇలాగే ఉంటారు. అందరు తల్లులు, నా తల్లి, మీ అమ్మ, వారి పిల్లలకు ఒక బలహీనత ఉంటుంది” అంటూ సానుభూతి వ్యక్తం చేశారు.
“30 ఏళ్ల క్రితం సోనియాగాంధీ పట్ల నాకున్న గౌరవం, రాహుల్ గాంధీ పట్ల ఉన్న గౌరవం అలాగే ఉంది. ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్-సోనియాగాంధీ కుమారుడిగా గౌరవం అట్లాగే ఉంది. వ్యక్తిగతంగా ఆయన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాను. ఆయనను విజయవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాం. కానీ అతనికి ఆసక్తి లేదు” అని ఆజాద్‌ను ఆసక్తను వ్యక్తం చేశారు.
తనను పార్టీ నుండి బైటకు వచ్చే విధంగా చేశారని పేర్కొంటూ ఎంతో ఆవేదనతో వచ్చానని చెప్పారు. తన పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా ఉండటం కేవలం సాకు  మాత్రమే అని, జి 23 లేఖ వ్రాసినప్పటి నుండి తనపై వివక్షతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
‘‘పార్టీ కోసం రక్తం ఇచ్చాం కాబట్టి లేఖ (జీ23) రాసే ముందు, తర్వాత 6 రోజులు నిద్రపోలేదు.. ఈరోజు పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులకు పార్టీ సీనియర్ల గురించి తెలియదు. మన గురించి కూడా తెలియని ఇలాంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు ఉండడం బాధాకరం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.