పెండింగ్ కేసులే న్యాయవ్యవస్థ ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాల్‌

పెద్ద సంఖ్యలో కేసులు విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉండటమే న్యాయవ్యవస్థ ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాల్‌ అని జస్టిస్‌ ఎన్‌వి రమణ తెలిపారు. శుక్రవారం ఉద్యోగ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కొలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.
దీర్ఘకాలం వ్యాజ్యాలు విచారణకు నోచుకోకపోవడం ప్రధాన సమస్య అయిందని తెలిపారు. తన పదవీకాలంలో ఈ సమస్య పరిష్కారానికి ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని విచారం వ్యక్తం చేశారు. ఏ రోజుకు ఆరోజు విచారణలు సంబంధిత ప్రక్రియలతోనే రోజులు గడిచినట్లు, ఈ క్రమంలో పెండింగ్ కేసుల పరిష్కారం ప్రాధాన్యతక్రమంలోకి రాలేదని తెలిపారు. 
 
పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారానికి అధునాతన టెక్నాలజీని విరివిగా వాడుకోవచ్చని చెబుతూ  సంబంధిత టూల్స్‌ను విరివిగా వాడకానికి తీసుకురావాలని సూచించారు.  ఇక పెండింగ్ కేసుల పరిష్కారానికి కృత్రిమ మేధను కూడా వాడుకునేందుకు యత్నించాల్సి ఉందని చెప్పారు.
టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి అనేక విధాలుగా యత్నించామని అయితే ప్రతికూలతలు , భద్రతా కారణాలతో ఈ దిశలో ఎక్కువగా ముందుకు వెళ్లలేకపొయ్యామని రమణ వివరించారు. కరోనా దశలో దాదాపు రెండేళ్ల పాటు కోర్టుల నిర్వహణనే ప్రధాన అంశం అయిందని చెబుతూ వాణిజ్య సంస్థల మాదిరిగా టెక్నాలజీ సాధనాసంపత్తిని న్యాయస్థానాలు నేరుగా మార్కెట్‌నుంచి సేకరించుకోలేకపొయ్యాయని తెలిపారు.
న్యాయవ్యవస్థకు ఉన్న సమస్యలు విభిన్నమైనవని, ఇతర రంగాల మాదిరిగా ఉండేవి కావని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతకు పలు కీలక మార్పులు జరగాల్సి ఉంది. అయితే న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలు (బార్ అసోసియేషన్) నుంచి సంపూర్ణ మనస్ఫూర్తి లేకపోతే ఈ మార్పులు తీసుకురావడం అసాధ్యం అవుతుందని చెప్పారు. 
భారత న్యాయవ్యవస్థను ఒక్క ఉత్తర్వు లేదా తీర్పు ద్వారా నిర్వచించలేమని ఆయన చెప్పారు. వ్యవస్థ విశ్వసనీయతను కోర్టు అధికారులు రక్షించాలని సూచించారు. విశ్వసనీయత చెక్కుచెదరకుండా ఉంటేనే సమాజంలోని వ్యక్తుల నుండి గౌరవం లభిస్తుందని ఆయన తెలిపారు.
 జూనియర్లను సరైన మార్గంలో నడిపించాలని సీనియర్‌ సభ్యులకు ఆయన సలహా ఇచ్చారు.
సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్‌ ఎన్‌వి రమణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరినప్పటి నుండి న్యాయవ్యవస్థలో అత్యునుత స్థానానికి చేరుకునే వరకు తాను ఎన్నో తీవ్ర పరిశీలనలు ఎదుర్కున్నట్లు చెప్పారు. వీటిలో కొన్ని కుట్రపూరితమైనవి కూడా ఉండటంతో తనతో పాటు, తన కుటుంబం కూడా బాధ పడినట్లు చెప్పారు.
 ‘అంతిమంగా సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది. జీవితంలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్నాను. నా మార్గంలో వచ్చిన అనిు సవాళ్లను స్వీకరించాను. ననుు నేను బలోపేతం చేసుకునాును.’ అని తెలిపారు. గత 75 ఏళ్లలో దేశ న్యాయవ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందినప్పటికీ, అది ప్రజల అంచనాల కంటే తక్కువగా ఉందని రమణ స్పష్టం చేశారు.
చాలాసార్లు న్యాయ వ్యవస్థ ప్రజల సమస్యను సమర్థించిందని చెప్పారు. బార్‌ అసోసియేషన్లు ప్రారంభించిన న్యాయ పోరాటాలే రాజ్యాంగం ప్రగతిశీల వ్యాఖ్యానాలకు దారితీశాయని, ఈ స్ఫూర్తితో బార్‌ ప్రజాస్వామ్యానిు బలోపేతం చేసేందుకుకృషి చేయాలని ఆయనసూచించారు . దేశమంటే మట్టికాదు… మనుషులను గురజాడ గేయానిు ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరు సమాజం, దేశం అంటే ప్రజల గురించి ఆలోచించాలని రమణ కోరారు.

కేసుల జాబితాలో మరింత పారదర్శకతకు ప్రయత్నం చేస్తానని తదుపరి సిజెఐ జస్టిస్‌ యుయు లలిత్‌ చెప్పారు. సంబంధిత ధర్మాసనాలు ముందు అత్యవసర విషయాలను ప్రస్తావించే వ్యవస్థను తీసుకొస్తానని, ఏడాది పొడువునా రాజ్యాంగ ధర్మాసనం పనిచేసేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.