లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు. లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేకుంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో ఎంపీ పర్వేష్‌వర్మతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ  రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్‌లు జరుగుతున్నాయని విమర్శింఛారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?. అని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోని అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

కానీ, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో పూర్తిగా శోధించి సత్యాన్ని బయటకి తీస్తాయని స్పష్టం చేశారు. “మేం ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు?. ఎంపీగా సంజయ్‌కు నిరసన తెలిపే హక్కు లేదా?” అని ప్రశ్నించారు.  అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తాము పారదర్శకంగా పనిచేస్తున్నమని సుధాన్షు స్పష్టం చేశారు.

కాగా, ఢిల్లీలో మద్యం దుకాణాలకు ఎల్ – వన్ కమిషన్ రెండు నుంచి 12 శాతం పెంచారని, అది ఎందుకో ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదు ఢిల్లీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ ఎంపీ, బీజేపీ నేత పర్వేష్‌ వర్మ మండిపడ్డారు. 

‘ఢిల్లీలో ఒక బాటిల్‌కు మరొక బాటిల్ ఉచితంగా ఇచ్చారు. కార్టెల్‌గా మారి జోన్లు ఇవ్వాలని మద్యం విధానంలో లేదు. మద్యం ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్, రిటైలర్.. ఈ మూడు ఒక్కరే. మహాదేవ్, బడి పంజా కంపెనీలు ఈ బిజినెస్ చేస్తున్నాయి. కరోనా నష్టాల పేరుతో రూ 144 కోట్ల  మద్యం మాఫియాకు మాఫీ చేశారు’ అని ఆరోపించారు.  

ఇది మద్యం పాలసీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎల్ -1 రిటైలర్ కు క్రెడిట్ నోట్ ఇచ్చి, వారి నుంచి వచ్చే నగదు ఆప్ పార్టీకి తరలించారని, ఆ డబ్బుని ఎన్నికలకు వినియోగించి మోదీకి తామే పోటీ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పాలసీ వల్ల విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయని చెప్పారు.

మద్యంపై పన్ను కూడా తగ్గించారని,  పన్నులలో, ఆదాయంలో ప్రభుత్వానికి ఖజానాకు గండి కొట్టారని విమర్శించారు. మొత్తం రూ 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెబుతూ ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది? అని ఎంపీ పర్వేష్‌ వర్మ, ఆప్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంకు  మబంధించి,  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీలను సస్పెండ్ చేసింది.