సొంతంగా కారు, స్థిరాస్తి లేని ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంతంగా కారు, ఎటువంటి స్థిరాస్థులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు. మరోవైపు.. బాండ్స్‌, షేర్లు, మ్యూచ‍్యువల్‌ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు.
ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి.
రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్‌ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసింది. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది.
 
అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫెక్ట్‌ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి. చరాస్తుల విశ్లేషణ ప్రకారం చేతిలో ఉన్న నగదు గతేడాది రూ. 36,900 నుండి రూ. 35,250కి స్వల్పంగా తగ్గింది. 
 
 ఒక నివేదిక ప్రకారం, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31, 2021 నాటికి  రూ. 1,52,480నుండి  నుండి రూ. 46,555కు తగ్గింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (రూ. 8.9 లక్షలు), రూ. 1.5 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలు, ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌ల రూపంలో మోదీ పెట్టుబడులు పెట్టగా, వీటిని 2012లో రూ. 20,000కు కొనుగోలు చేశారు.
 

‍ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేబినెట్‌ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, స్థిరాస్తులు రూ.2.97 కోట్లు ఉన్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నికర ఆస్తుల విలువ మార్చి 31, 2022 చివరి నాటికి రూ. 1.62 కోట్ల నుండి రూ. 1,83 కోట్లకు పెరిగింది.

పశుసంవర్థక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల నికర విలువ రూ.7.29 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే రూ.1.42 కోట్లు పెరిగింది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మార్చి 31, 2022 నాటికి మొత్తం ఆస్తులు రూ. 35.63 కోట్లు, అప్పులు రూ. 58 లక్షలుగా నివేదించారు. సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ. 1.43 కోట్లుగా ప్రకటించారు.