ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రాకు రజతం

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా రజతం గెలుచుకున్నాడు.  స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్‌ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. 
 
గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90.54 మీటర్లు త్రో చేయడంతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజత పతాకాన్ని గెలుచుకున్న రెండవ భారతీయుడిగా నీరజ్‌ చోప్రా నిలిచారు. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదు, ఆరు ప్రయత్నాల్లో నీరజ్‌ ఫౌల్‌ చేశాడు.
 
ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక పతకం ఉంది. ఇప్పుడు నీరజ్ సాధించిన రజతం భారత్‌కు రెండోది. మొదటి పతకం 2003లో అంజు బాబీ జార్జ్  లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారత్ ఖాతాలో రెండో మెడల్ చేరింది.
 
వద్లెచ్‌ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. మరో భారత జావెలిన్‌ త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ మూడు రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచాడు.
 
గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో  నీరజ్‌ చోప్రా మొదటిసారి స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. 2008 బీజింగ్‌ గేమ్స్‌లో ఎల్లో మెటల్‌ను కైవసం చేసుకున్న షూటర్‌ అభినవ్‌ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడుగా నీరజ్‌ నిలిచారు.
నీరజ్ చోప్రా రజతం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ నీరజ్ చోప్రాకు అభినందనలు తెలియజేశారు. ఇక హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా నీరజ్ చోప్రా సాధించిన ఘనతను కొడియాడారు. నీరజ్ చరిత్ర సృష్టించాడన్న ఆయన.. ఈ ఛాంపియన్ షిప్ లో ఇండియాకు రజతం రావడం ఇదే మొదటిసారని చెప్పారు. నీరజ్ హర్యానాకే గర్వకారణమని కట్టర్ వ్యాఖ్యానించారు.