ఎస్సీ.,ఎస్టీల సమస్యలు వారివే కావు, ప్రజలందరివి 

ఎస్సీ.,ఎస్టీల సమస్యలు ఎస్సీ., ఎస్టీలవి మాత్రమే కావని, దేశంలోని ప్రజలందరివీ అని ప్రముఖ సామజిక కార్యకర్త, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యకారిని సభ్యులు భాగయ్య స్పష్టం చేశారు.  
సోషల్ స్టడీస్ ఫౌండేషన్ (ఎస్ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో “భారత్ లో షెడ్యూల్డు కులాలు నేడు- రేపు”   అంశంపై డిల్లీలోని చోటూ రామ్ ధర్మ సత్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ముగింపు ప్రసంగం చేస్తూ  మన ప్రాచీన కాలంలో వర్ణ అసమానతలు, అస్పృశ్యతలు మనదేశంలో లేవని తేల్చి చెప్పారు.
మన దేశం అస్మాంతలతో కూడిన దేశంగా జరుగుతున్న ప్రచారం అసత్యం అని ఆయన ఈ  సందర్భంగా పేర్కొన్నారు.ఇవి మధ్య కాలంలో వచ్చిన దురాచారాలు మాత్రమే అని చెబుతూ కుల అసమానతలు, అస్పృశ్యత ధర్మ సమ్మతం కావని చెప్పారు.వీటిని తొలగించడం కోసం బుద్ధుడు నుండి మలయాళ స్వామి వరకు ధర్మాచార్యులు, అనేక మంది సామాజిక కార్యకర్తలు కృషి చేశారని వివరించారు.
భారత రాజ్యాంగం సామాజిక సమతను మనకు అందిస్తోందని గుర్తు చేస్తూ మనకు గల సమస్యలను రాజ్యాంగ బద్ధంగా మాత్రమే పోరాడాలని భాగయ్య హితవు చెప్పారు. మన హితం భారత దేశ హితం లోనే ఉందని అంటూ అనేక మంది ప్రయత్నాల ఫలితంగా సామాజిక సమరసత ఏర్పడే మంచి స్థితి దగ్గరలో మన దేశం నేడు ఉన్నదని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితులలో  మేధావి ఎస్సీలుగా మన వంతు పాత్ర నిర్మాణాత్మకంగా మనం పోషించాలని భాగయ్య పిలుపిచ్చారు. సామాజిక సమతను సమాజంలో ఏర్పాటు చేయడంతో పాటు, వేర్పాటు శక్తులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యా పరంగా,
సామాజికంగా, ఆర్థికంగా ముందున్న మనం మన కంటే వెనుక ఉన్న ఎస్సీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 
రాజస్థాన్, డిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు 16 మంది మహిళలతో సహా మొత్తం 61 మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 
షెడ్యూల్డు కులాల అభివృద్ధికి అనుకూల శక్తి కేంద్రాలు ఏవి?, షెడ్యూల్డు కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేడు- రేపు, సమస్యల పరిష్కారం మార్గం- మన బాధ్యత. విశ్వవిద్యాలయంలో ఎస్సీల కార్య కలాపాలు వంటి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.  సోషల్ స్టడీస్ ఫౌండేషన్ ఈ విధంగా మరో నాలుగు సెమినార్లను ముంబై, లక్నో, కలకత్తా, హైదరాబాద్ లలో నిర్వహించాలని నిర్ణయించింది.