
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ను ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన సోమవారం పార్లమెంట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. జగదీప్ నామినేషన్ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వారి వెంట ఉన్నారు.
1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజును జిల్లా కిథానా గ్రామంలో జగదీప్ ధన్‌ఖడ్ జన్మించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, రాజస్థాన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం విద్యనభ్యసించారు. 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్ మెంబర్‌గా నమోదు చేసుకున్నారు. చాలా ఏండ్ల పాటు రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు.
జులై 19తో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 6న జరగనుండగా, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం