మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నర్వేకర్

బిజెపి అభ్యర్థి రాహుల్ నార్వేకర్ మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు, అతనికి మద్దతుగా మొత్తం 164 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 107 మంది ఓటేశారు.  దీంతో స్పీకర్ గా రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. 
 
ఈ ఓటింగ్ కు ఎంఐఎం పార్టీ దూరంగా ఉంది. అనంతరం స్పీ్కర్గా నర్వేకర్ బాధ్యతలు స్వీకరించారు. నర్వేకర్ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో శాసన సభ “జై భవానీ, జై శివాజీ”, “జై శ్రీ రామ్”, “భారత్ మాతా కీ జై, వందేమాతరం” నినాదాలతో మార్మోగింది.
 
స్పీకర్ ఎన్నిక కోసం శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ఉన్న శివసేన ఎమ్మెల్యే, ఉద్ధవ్ థాకరే విధేయుడు రాజన్ సాల్విపై ఆయనను బరిలోకి దించారు. ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అయిన నర్వేకర్, ఎన్‌సిపి నాయకుడు రాంరాజే నింబాల్కర్ అల్లుడు. 
 
2021 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అంతకుముందు శివసేనకు సీఎం ఏక్ నాథ్ షిండే ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన నేతలు  మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ వేశారు.  ఈ మేరకు ఆఫీసు తలుపు మీద నోటీసు అంటించారు.
 శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నామని నోటీసులో  మరాఠీలో రాసి పెట్టారు.  మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం  ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశమైంది.
స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్‌ నర్వేకర్‌.., శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ తరపున రాజన్‌ సాల్వీ బరిలో నిలిచారు.  ఈ నేపథ్యంలో   అన్ని పార్టీల నేతలు అసెంబ్లీకి హాజరయ్యారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీతో కలవడంతో..రాహుల్ సర్వేకర్  గెలుపు  లాంఛనమైంది.
సోమవారం మహా సీఎం షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. వీరంతా షిండేకు మద్దతుగా నిలవనున్నారు. వీరితో పాటు షిండేకు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయనున్నారు.