డీజీపీనీ వదలని సైబర్‌ నేరగాళ్లు

ప్రముఖుల ఫొటోలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్‌ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్‌ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్‌ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు.

అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు.   ఓ వాట్సప్ నంబరుకు రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఫోటోను డిపిగా పెట్టి మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రముఖులకు, అధికారులకు సందేశాలు పంపించారు.

ఈక్రమంలో 9785743029 నంబర్‌తో వాట్సా ప్ క్రియేట్ మోసాలకు పాల్పడేందుకు సిద్ధమవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర డిజిపి మ హేందర్‌రెడ్డి ఫొటోను డిపిగా పెట్టి పోలీసులు ఉన్నతాధికారులు,ప్రముఖులతో పా టు సామాన్యులకు సందేశాలు పంపించడం మొదలు పెట్టారు.

తొలుత స్వచ్ఛంద సంస్థ పేరుతో సందేశాలు పంపిన నేరగాళ్లు ఆ లింకును తెరచి వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన డిజిపి అది తన నెంబర్ కాదని ఎవరూ స్పందించొద్దని తెలిపారు.

వెంటనే ఈ విషయంపై అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆ నంబరును వెంటనే బ్లాక్ చేయించారు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ నంబర్ తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డిజిపి పేరిట మోసాలకు యత్నించిన ముఠా గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసే కేటుగాళ్లు తాజాగా డిజిపి పేరిట వాట్సప్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి సందేశాలకు ఎవరూ స్పందించ వద్దని ప్రజలకు పోలీసు బాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరస్థులు ప్రముఖులకు చెందిన సామాజిక మాధ్యమాలను హ్యాక్ చేయడం, నకిలీవి సృష్టించి డబ్బులు అడగడం వారికి పరిపాటిగా మారిందని వివరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారుల రహస్య వివరాలు తెలుసుకోవడానికి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని ఆ ఉచ్చులో పడొద్దని పోలీసు బాసులు సూచిస్తున్నారు.

నకిలీ ఖాతాలు, వాట్సాప్ డిపిలు, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని పోలీసులు సూచించారు. గతంలోనూ అదనపు డిజి స్వాతి లక్రా, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్‌తో పాటు పలువురు ఎసిపి, సిఐల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే.