ఆఫ్ఘన్ లో భూకంపం … 920 మంది మృతి!

అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. మరో 600 మంది వరకు   గాయాలకు గురయినట్లు చెబుతున్నారు. అఫ్గన్‌ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్‌ కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

రాళ్ల ఇళ్లు కావడంతో తీవ్ర గాయాలతో చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.

ధృవీకరించిన మరణాలలో ఎక్కువ భాగం తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్ పక్టికాలో ఉన్నాయి. ఇక్కడ 255 మంది మరణించగా,  200 మందికి పైగా గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్ అయుబి చెప్పారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లో 25 మంది మరణించారని, 90 మందిని ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, భారత దేశాలలో  అంతటా 119 మిలియన్ల మంది ప్రజలు 500 కిలోమీటర్ల (310 మైళ్ళు) కంటే ఎక్కువ భూకంప ప్రకంపనలను అనుభవించారని యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ ఒకటి తెలిపింది.

“కొన్ని గ్రామాలు పర్వతాలలోని మారుమూల ప్రాంతాలలో ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  వివరాల సేకరణకు కొంత సమయం పడుతుంది” అని పేర్కొంటున్నారు. బుధవారం నాటి భూకంపం 2002 నుండి అత్యంత ఘోరమైనది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు 44 కి.మీ (27 మైళ్ళు) దూరంలో సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిసి) తెలిపింది.

గత ఏడాది ఆగస్ట్‌లో దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్‌లకు  చేపట్టడం పెను సవాల్ గా మారింది.  ప్రపంచ దేశాల ఆర్ధిక  ఆంక్షలు,బ్యాంకు  కారణంగా ఇప్పటికే తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. పైగా, అంతర్జాతీయంగా మానవతా సహాయం సహితం ఏమాత్రం లభిస్తుంది అన్నది సందేహమే.