కాశ్మీర్ లో ఈ ఏడాది వంద మంది ఉగ్రవాదులు హతం

ఈ ఏడాది 2022 ఆరంభం ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్‌ లో 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందించారు. వేర్వేరు ఎన్‌కౌంటర్ ఆపరేషన్లలో ఆటంకవాదులను తుదముట్టించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. 
 
మృత్యువాత పడ్డ ఉగ్రవాదిల్లో అత్యధికంగా 63 మంది నిషేధిత లష్కేర్ తోయిబాకు చెందినవారు కాగా జేషే మొహమ్మద్‌  ఉగ్రసంస్థకు చెందిన 24 మంది ఉగ్రవాదిలు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. వేర్వేరు ఆపరేషన్లలో చనిపోయిన ముష్కరుల్లో విదేశాలకు చెందినవారి సంఖ్య 29గా ఉంది. 
 
నిరుడు ఇదే 6 నెలల కాలవ్యవధిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యతో పోల్చితే ఈ ఏడాది చనిపోయినవారి సంఖ్య రెట్టింపుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే కాల వ్యవధిలో 50 మంది ఉగ్రవాదులను చంపేయగా, అందులో ఒక విదేశీ ఉగ్రవాది ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు.

మావోయిస్టులపై భారీగా రివార్డులు 

మావోయిస్టు పార్టీ నేతలపై ఎన్ఐఏ రివార్డులను ప్రకటించింది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్పై రూ.50 లక్షలు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే 2013లో ఛత్తీస్గఢ్ జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న 21 మందిపై రూ.1.25 కోట్లకు పైగా రివార్డులను ప్రకటించింది. 
 
కమాండర్ హిడ్మాపై రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది. ఇక మావోయిస్ట్ అగ్రనేత గణపతిపై రూ.కోటి రివార్డ్‌ను ప్రకటించింది. బస్వరాజ్, కటకం సుదర్శన్, మల్లోజుల వేణుగోపాలరావులపై  రూ.కోటి చొప్పున రివార్డులను ఎన్ఐఏ ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్పై ఒక్కొక్కరిపై రూ.7 లక్షల చొప్పున రివార్డ్‌ను ఎన్ఐఏ ప్రకటించింది.