ప్రవక్తపై వాఖ్యలు భారత్ ఆంతరంగిక వ్యవహారమన్న బంగ్లా మంత్రి 

మహమ్మద్ ప్రవక్తను అవమానించేటట్లు వాఖ్యలు చేసారని చెలరేగిన  వివాదం భారతదేశ అంతర్గత విషయమని, ఢాకాలోని ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రి డాక్టర్ హసన్ మహమూద్ స్పష్టం చేశారు.

“మొదట, ఇది బాహ్య సమస్య (బంగ్లాదేశ్ కు సంబంధించి). ఇది భారతదేశ సమస్య, బంగ్లాదేశ్‌కు సంబంధించినది కాదు. మేము ఏమీ చెప్పనవసరం లేదు”, అని మహమూద్ ఢాకాలో సందర్శిస్తున్న  భారతీయ జర్నలిస్టుల బృందంతో అనధికారిక ఇంటరాక్షన్‌లో పేర్కొన్నారు.

ఈ విషయంలో తగు చర్య తీసుకున్నందుకు భారత అధికారులను మహమూద్ అభినందించారు. ఈ సమస్యను మరింత “రాజేయ” వద్దని ఆయన అందరికి సూచించారు.

బిజెపికి చెందిన ఇద్దరు మాజీ అధికార ప్రతినిధులు ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డజనుకు పైగా ముస్లిం దేశాలు , 57 దేశాల ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఇసి) నిరసన లేదా ఖండన ప్రకటనలు జారీ చేసిన సమయంలో ఢాకా మౌనంగా ఉందే? అని వారు అడిగారు. దేశీయంగా, ఇస్లామిక్ ప్రపంచంలో షేక్ హసీనా ప్రభుత్వం రాజీధోరణి ఆవలంభించదని పేర్కొంటూ, మహమూద్ ఇలా అన్నాడు:

“మేము ఏ విధంగానూ రాజీపడము. దైవ ప్రవక్తను అవమానించినప్పుడు, ఎక్కడ జరిగినా మేము దానిని తీవ్రంగా ఖండిస్తాము. కానీ భారత ప్రభుత్వం చర్య తీసుకుంది, దానికి మేము వారికి ధన్యవాదాలు. మేము భారత ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది”.

బంగ్లాదేశ్‌లో ప్రవక్తను అవమానించడం పెద్ద సమస్య కాదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. “కాబట్టి నేను సమస్యను ఎందుకు ప్రేరేపించాలి? దీనికి ఇప్పటికే తగినంత ప్రాధాన్యత లభించలేదా? నా పని మరింత తీవ్రతరం చేయడం కాదు” అని పేర్కొన్నారు. 


శుక్రవారం నాడు ఢాకాలో ప్రధాన మసీదుకు వెలుపల కూడా ముస్లిం సంఘాలు కొన్ని నిరసనలు జరిపాయి. బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ గ్రూపులు పవిత్ర ప్రవక్త పేరును వివాదాల్లోకి లాగినప్పటికీ నరేంద్ర మోదీ  ప్రభుత్వాన్ని విమర్శించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని దాడి చేశారు.

అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై రెచ్చగొట్టే చర్యలకు నిరాకరిస్తూ వస్తున్నది. దేశంలోని అధికార అవామీ లీగ్‌కు సీనియర్ ఆఫీస్ బేరర్ కూడా అయిన మహమూద్, ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబంధాలో జరిగిన పార్టీ సమావేశంలో గత శుక్రవారం మాట్లాడుతూ “అనవసరమైన గందరగోళం లేదా రెచ్చగొట్టడం” సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

“ఏ మతాన్ని కించపరచడాన్ని మేము సహించము.  ఇతర దేశాల సంఘటనలపై ఎవరైనా ఈ దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తే, వారిని ఉక్కుపాదంతో నియంత్రిస్తాం” అని స్పష్టం చేశారు.

కాగా, ఢాకాలో, భారతదేశంలోని సీనియర్ రాజకీయ ప్రముఖులు బంగ్లాదేశ్ “చొరబాటుదారులకు” వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు చేస్తున్న వాఖ్యల గురించి ప్రశ్నించగా  ఆయా నాయకులకు తమ దేశీయ రాజకీయ వత్తిడులు ఉండిఉండొచ్చని మహమూద్‌ పేర్కొన్నారు.  వారి ప్రకటనల గురించి బంగ్లాదేశ్ పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలిపారు.

“దేశీయ రాజకీయాల కారణంగా వారు ఇలా చెప్పి ఉండవచ్చు… దేశీయ రాజకీయాల కారణాలతో రాజకీయ నాయకులు చాలా విషయాలు చెబుతారు. మేము అటువంటి అంశాలపై వివరణలు అడగము. మేము పరిస్థితులను అర్ధం చేసుకుంటాము…. మాకు  వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు,” అని మహమూద్ చెప్పారు.

ప్రధానమంత్రులు హసీనా, మోదీ నేతృత్వంలో బంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచినందుకు భారత  ప్రజలకు,  భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

“భారత సైనికులు బంగ్లాదేశ్ ప్రజల కోసం తమ రక్తాన్ని చిందించారు. మీరు (భారతీయులు) మా ప్రజలకు మీ తలుపులు,  మీ హృదయాలను తెరిచారు. బంగ్లాదేశ్, భారతదేశ ప్రజల మధ్య సంబంధం యుద్ధం బూడిద నుండి పుట్టింది. మన రక్తంలో కలిసిపోయింది. మనం నిజంగా రక్తం పంచుకున్న సోదరులం, ”అని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

ఇంకా కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య వాణిజ్యం, కమ్యూనికేషన్ సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాల అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.   “మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బంగ్లాదేశ్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది” అని మహమూద్ కొనియాడారు. .

రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఆలస్యమవుతున్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందం గురించి, ఈ ఏడాది చివర్లో భారత ప్రధాని హసీనా  జరుపనున్న భారత్ పర్యటనపై  ప్రభావం చూపుతుందా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి  సమాధానమిచ్ఛారు: “తీస్తాలో, సమస్య పరిష్కారంలో జాప్యానికి కేంద్ర ప్రభుత్వం సమస్య కాదు. సమస్య  ప్రాంతీయ ప్రభుత్వం (పశ్చిమ) బెంగాల్)…. కాబట్టి తీస్తా ఇంకా పూర్తి కాకపోయినా ప్రధాన మంత్రి భారతదేశాన్ని సందర్శించవచ్చు. అయితే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇది ఇప్పటివరకు పరిష్కరించబడలేదు అంటే కేంద్ర ప్రభుత్వం (భారతదేశం) వల్ల కాదు” అని వివరణ ఇచ్చారు.