జులై 18న రాష్ట్రపతి ఎన్నిక

జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఉంటుందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్   రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జులై 24న ముగియనుందని   దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ వచ్చే నెల 24లోపే పూర్తి కావాల్సి ఉంటుందని  తెలిపారు.   
 రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్‌ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి సహా… అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
కాగా, పార్లమెంట్‌ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక‍్రటరీ జనరల్‌ వ్యవహరించనున్నారు. ప్రతి రాష్ట్రానికి ఎన్నికల సంఘం నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను పంపుతారు. పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 
  • ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 29.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2.
  • జూలై 18న పోలింగ్‌,
  • జూలై 21వ తేదీన కౌంటింగ్‌ జరుగనుంది.
  ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలుంటారు.
 
ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. బ్యాలెట్‌ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.