భారత్ – జపాన్ ల మధ్య సైనిక సహకార ఒప్పందం

భారత్, జపాన్ సైనిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశం, 11 దేశాలకు ప్రాణాంతకమైన రక్షణ పరికరాల ఎగుమతులను జపాన్ అనుమతించింది. దాంతో త్వరలో భారత్ కు జపాన్ తయారీ క్షిపణులు, జెట్ యుద్ధ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.

నిక్కీ నివేదిక ప్రకారం భారతదేశం, ఆస్ట్రేలియా, కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులు చేయడానికి వచ్చే ఏడాది మార్చి నాటికి నిబంధనలు సడలించబడతాయి. జపాన్ రక్షణ పరికరాలను బదిలీ చేయడానికి ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసింది.  

2014లో వాటి ఎగుమతిని నిషేధించే నిబంధనలను సడలించింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. మంగళవారం టోక్యోలో క్వాడ్ నేతల సమ్మిట్ సందర్భంగా జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత,రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని  ఫ్యూమియో కిషిడా అంగీకరించారు.

దానితో కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత్, జపాన్ ఇప్పుడు ఇండో- పసిఫిక్‌లో బలమైన భద్రతా సహకారాన్ని కలిగి ఉన్నాయి.  ఈ ప్రాంతం అంతటా చైనా యొక్క దూకుడు వైఖరి ఆందోళనలన కారణంగా ఈ రెండు దేశాల సహకారం చాలా వరకు బలపడింది.

ఇలా ఉండగా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్  న్యూఢిల్లీలో హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టోతో అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ)పై అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.విదేశీ వ్యవహారాల మంత్రి  జైశంకర్,  మంత్రి స్జిజార్టోతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశం-హంగేరీ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా ప్రపంచ వ్యవహారాలపై చర్చించారు.