సావర్కర్ న్యాయవాది, ఉద్యమకారుడు, రచయిత, రాజకీయవేత్త కూడా. స్వాతంత్య్ర సమరయోధుడు. సుదీర్ఘకాలం విదేశీ పాలనలో బానిస భావజాలంతో సాధారణ భారతీయులు ఆత్మనూన్యతతో బాధపడుతున్న సమయంలో `హిందుత్వ’ అనే ఆధునిక భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చి, వేల సంవత్సరాల దివ్యమైన పరంపరకు వారసులమని, వారిలో ఉత్తేజం, కర్తవ్యదీక్ష కలిగించిన సమరసేనాని.
ఆయన వ్రాసిన `హిందువు ఎవరు?’ గ్రంధం అతను భారత దేశం అంటే ఏమిటి? అనే దాని గురించి తన ఆలోచనలతో భారతీయ సమాజంలో నూతన ఉత్సాహాన్ని కలిగించారు. ఇటీవలనే దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ సావర్కర్ జీవితంపై బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. హైవే ఫేమ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించనున్నారు.
1920 ప్రాంతంలో జైలులో ఉన్న సమయంలో ఆయన వ్రాసిన “ఎవ్వరు హిందువు?” అన్న కరపత్రం ఆధునిక `హిందుత్వ’ భావనకు ఒక రాజకీయ, సాంస్కృతిక ప్రాతిపదికను ఏర్పాటు చేసింది. ఈ భూభాగంలో ఉన్నవారంతా హిందువులే అని స్పష్టం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ వారు ఈ అభిప్రాయాన్ని అంగీకరించి ఉండినట్లయితే దేశ విభజనను నివారించేవారని పలువురు భావిస్తున్నారు.
ఒక విధంగా 1925లో డా. హెగ్డేవార్ ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు ఈ `హిందుత్వ’ భావనే బలమైన సైద్ధాంతిక ప్రాతిపదిక ఏర్పాటుకు దోహదపడిన్నట్లు చెప్పవచ్చు. సావర్కర్ గురించి తాజాగా .ఉదయ్ మహూర్కర్ , చిరయు పండిత్తిల్ వ్రాసిన గ్రంధంలో కేవలం వోట్ బ్యాంకు రాజకీయాలకోసం కాంగ్రెస్ ఏ విధంగా దేశవిభజనకు దోహదపడిందో వివరించారు.
1937 నుండి 1942 వరకు హిందూ మహాసభకు అధ్యక్షుడిగా కాంగ్రెస్ కు ప్రత్యామ్న్యాయంగా బలమైన రాజకీయ ఉద్యమం ఏర్పాటుకు ప్రయత్నించారు. నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ సాగిస్తున్న `ముస్లిం సంతుష్టీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. `హిందూ రాష్ట్ర’ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఆయనే. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఈ పదం ఉపయోగించారు.
1945లో హిందూ మహాసభ ఒక రాజకీయ పార్టీగా అన్ని స్థాయిలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో, కాంగ్రెస్ తన వ్యూహాలను మార్చుకుంది. హిందూ ఓటర్లను హిందూ మహాసభ నుండి దూరం చేయడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి 1945-46 ప్రాంతంలో సెంట్రల్ అసెంబ్లీలో 102 సీట్లలో ఒక్కటి కూడా హిందూ మహాసభ గెలుచుకోకుండా చూసింది.
పరోక్షంగా వేర్పాటువాదం తెరపైకి తీసుకొచ్చిన ముస్లిం లీగ్ కు మద్దతు ఇస్తూ, హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం దేశ విభజనకు కాంగ్రెస్ దాసోహమైన్నట్లు ఆ రచయితలు ఆరోపించారు.
తొలి నుండి విప్లవకారుడే
సావర్కర్ 1883లో ఒక మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రారంభ రోజుల నుండి, భారత స్వాతంత్య్ర పోరాటంలో తీవ్రవాదం వైపు ప్రభావం చూపారు. పుణేలో పాఠశాల విద్యార్ధిగానే సోదరుడితో కలసి `అభినవ్ భారత్ సొసైటీ’ అనే రహస్య సంస్థను నెలకొల్పి విప్లవ కార్యకలాపాలు ప్రారంభించారు.
లండన్‌లో లా విద్యార్థిగా ఉన్న రోజుల్లో, విప్లవకారులకు కేంద్రంగా ఉన్న `ఇండియా హౌస్’ లో రాడికల్ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించాడని నివేదికలు చెబుతున్నాయి. ఆయన విప్లవ మార్గాల గురించి భారతీయ విద్యార్థుల బృందానికి బోధించడంలో సహాయం చేశారు. అందుకనే అక్కడ విప్లవ కార్యకలాపాలు సాగిస్తున్నారని 1910లో అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ చేశారు.
సావర్కర్ లండన్‌లో ఉన్న రోజుల్లోనే భారతదేశంలోని బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు గురించి వ్రాసిన “ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్” గ్రంధం మన స్వతంత్ర పోరాటంపై కీలకమైన ఉత్తేజం కలిగించింది. అప్పటివరకు, ఆధునిక సైన్యంతో రవి అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వారిని ఎదిరింపలేమనే నూన్యతా భావం భారతీయులలో ఉండెడిది. బ్రిటిష్ వారి ఆధునిక విద్య వైపు మొగ్గు చూపిన పలువురు వారికి దాసోహం కావడం ప్రారంభించారు.
అటువంటి సమయంలో 1857లో జరిగిన తిరుబాటు’ అంటూ, అంతగా ప్రాధాన్యత లేనిదిగా బ్రిటిష్ వారు చేస్తున్న ప్రచారానికి భారతీయులు సహితం ప్రభావితం అయ్యారు. అయితే బ్రిటిష్ పాలకులను తరిమిగొట్టి, స్వతంత్ర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడంకోసం భారతీయులు సాగించిన `ప్రధమ స్వతంత్ర సంగ్రామం’ అంటూ ఓ గ్రంధాన్ని వ్రాసి, ఆనాటి పోరాటాన్ని సవివరంగా సావర్కర్ వివరించారు. గుబాటును స్థానికంగా సదుపాయాలకు జరిగిన `సిపాయిల తిరుగు
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు అంటూ సావర్కర్ 1857 సంఘటనలను ఫ్రెంచ్, అమెరికన్ విప్లవాలతో పోల్చారు. ఈ గ్రంధం అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. బ్రిటిష్ వ్యతిరేక కంటెంట్ కారణంగా ఈ పుస్తకాన్ని వలస పాలకులు నిషేధించినా రహస్యంగా దేశ ప్రజలకు చేరింది. దానితో దేశ ప్రజలలో బలమైన స్వతంత్ర కాంక్ష బయలుదేరింది. వారిని దేశం నుండి వెళ్లగొట్టడం కష్టం కాదనే అభిప్రాయం కలిగింది. తదుపరి రోజులలో విప్లవకారులకు, స్వతంత్రం కోసం పోరాడిన వారికి ఈ గ్రంధం ఓ మార్గదర్శిగా, స్ఫూర్తిగా మారింది.
1909 మోర్లే-మింటో సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు సావర్కర్‌ను అరెస్టు చేసి ప్రయత్నించారు. 1911లో, అండమాన్, నికోబార్ దీవులలోని అపఖ్యాతి పాలైన సెల్యులార్ జైలులో ఆయనకు రెండు జీవిత కాల శిక్షలు, అంటే 50 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దీనిని కాలాపానీ అని పిలుస్తారు. నిర్బంధంలో దారుణమైన చిత్రహింసలకు గురి చేశారు. ఏకాంతవాసంలో దుర్భరమైన పరిస్థితులలో ఉంచారు.
క్షమాబిక్షపై వివాదం
ఈ సందర్భంగా ఆయన క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసి, బ్రిటిష్ వారి ముందు సాగిలపడి విడుదల అయ్యారని కాంగ్రెస్ వారు ఆయన పట్ల దుష్ప్రచారం సాగించారు. అయితే అంతటి నిర్బంధంలో సహితం ఆయన ఏనాడూ బ్రిటిష్ పాలకుల ముందు సాగిలపడి ప్రయత్నం చేయలేదు. అయితే ఆ జైలులో ఉన్న మిగిలిన సాధారణ ఖాదీల విడుదలకు తన వంతు ప్రయత్నాలు చేశారు.
జైలులో దీర్ఘకాలం ఉండడం కన్నా, విడుదలకు గల అవకాశాలు ఉపయోగించుకొని, బయట ఉండటం ప్రజాసేవకు ఎక్కువ ప్రయోజనకరం కాగలదని స్వతంత్ర పోరాట యోధుల సలహాలను గౌరవించారు. జైలులో న్యాయవాదిగా, ఉన్నత విద్య గల ఏకైక వ్యక్తిగా ఆయన వారందరి పక్షాన పిటీషన్లు తయారు చేసేవారు.
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడుల ఫలితంగా క్రియాశీల రాజకీయాలలో పాల్గొనరాదనే అనే షరతు మీద విడుదలైన్నట్లు అనేకమంది పరిశోధకులు స్పష్టం చేశారు. ఆ విధంగా 1924లో విడుదలయ్యారు. అప్పటి నుండి క్రియాశీల రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ సామజిక సేవా కార్యక్రమాలకు దూరంగా లేరు. ఏ సందర్భంలో కూడా బ్రిటిష్ వారి పట్ల లొంగుబాటు ధోరణిని ప్రదర్షింపలేదు. 1937 నుండి దేశంలో విస్తృతంగా పర్యటించారు. అనర్గళ ప్రసంగాలతో ప్రజలను రాజకీయ, సామజిక అంశాలపై
సావర్కర్ కేవలం విప్లవకారుడు, రాజకీయ వాది మాత్రమే కాదు. ఓ గొప్ప సామజిక సంస్కర్త కూడా. సమాజంలోని కులం, మూఢ ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. సామాజిక ఐక్యతతో పాటు సామాజిక న్యాయం భావనల ఆధారంగా కుల రహిత సమాజాన్ని ఆయన సమర్థించారు.
కుల వ్యవస్థలోని వైవిధ్యాన్ని నిర్మూలించి, హిందూ ఐక్యతపై ఆధారపడిన దేశాన్ని నిర్మించాలని, ఇక్కడ దళితులు గౌరవంగా, సంతోషంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. మనుస్మృతి వంటి కులాన్ని సమర్ధించే రచనలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంటరానితనంకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. 1948లో గాంధీ హత్యకు సావర్కర్ సహ-కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత ఆయన అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందారు.
జీవిత ఆత్మార్పరణం
1963 నవంబర్ 8న సావర్కర్ భార్య యమున మరణించింది. 1 ఫిబ్రవరి 1, 1966 నుండి సావర్కర్ మందులు, ఆహారం, నీటిని తీసుకోవడం విడిచిపెట్టారు. దానిని ఆయన ఆత్మార్పన్ (మరణించే వరకు ఉపవాసం) అని పేర్కొన్నారు. తన మరణానికి ముందు, ఆయన “ఆత్మహత్య నహీ ఆత్మార్పణ్” అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు.
అందులో ఒకరి జీవిత లక్ష్యం ముగిసినప్పుడు మరియు సమాజానికి సేవ చేసే సామర్థ్యం మిగిలిపోయినప్పుడు, వేచి ఉండటం కంటే జీవితాన్ని ఇష్టానుసారం ముగించడం మంచిదని వాదించారు. ఆయన పరిస్థితి ఫిబ్రవరి 26, 1966న బొంబాయి (ఇప్పుడు ముంబై)లోని తన నివాసంలో మరణించడానికి ముందు “అత్యంత తీవ్రమైనది” అని వైద్యులు పేర్కొన్నారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆయనను బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆ రోజు ఉదయం 11:10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. మరణానికి ముందు, సావర్కర్ తన అంత్యక్రియలను మాత్రమే నిర్వహించాలని, హిందూ విశ్వాసం మేరకు 10వ, 13వ రోజు ఆచారాలను తొలగించమని తన బంధువులను కోరారు. ఆ మేరకు ఆయన అంత్యక్రియలను బాంబేలోని సోనాపూర్ ప్రాంతంలోని విద్యుత్ శ్మశాన వాటికలో అతని కుమారుడు విశ్వాస్ మరుసటి రోజు నిర్వహించారు.
ఆయన దహన సంస్కారాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం సంతాపం తెలిపారు. ఆయనకు విశ్వాస్ అనే కుమారుడు, ప్రభా చిప్లుంకర్ అనే కుమార్తె ఉన్నారు. ఆయన మొదటి కుమారుడు ప్రభాకర్ చిన్నతనంలోనే చనిపోయాడు. ఆయన ఇల్లు, ఆస్తులు, ఇతర వ్యక్తిగత అవశేషాలు ప్రజల ప్రదర్శన కోసం భద్రపరచారు.
ఆయన మృతి పట్ల మహారాష్ట్ర లేదా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ సావర్కర్ పట్ల సాగిస్తున్న అటువంటి రాజకీయ ఉదాసీనతను ఇప్పటికి కొనసాగిస్తున్నది. మరణం తర్వాత చాలా కాలం పాటు కొనసాగింది.
.
More Stories
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో సంక్షోభంలో పాకిస్తాన్!