యాసిన్ మాలిక్‌కు శిక్షపై ఇస్లామిక్ సంస్థ వాఖ్యలపై ఆగ్రహం

ఉగ్రవాదానికి నిధులను సమకూర్చుతున్నారనే ఆరోపణలు రుజువుకావడంతో ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు భారతీయ న్యాయస్థానం జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకారసంస్థపై భారత దేశం మండిపడింది. ఈ తీర్పును విమర్శించడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తోందని ధ్వజమెత్తింది.

యాసిన్‌ మాలిక్‌ శిక్ష విషయంలో భారత్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్‌ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది.  అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది.

ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్-ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు భారత్ హితవు చెప్పింది.  ఈ జాఢ్యాన్ని ఎంత మాత్రం సహించరాదని ప్రపంచం కోరుతోందని తెలిపింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్‌ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు న్యాయస్థానానికి వివరించామని గుర్తు చేశారు. మాలిక్‌కు శిక్ష విధిస్తూ స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బాగ్చి స్పందిస్తూ అవి తమకు  ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.

యాసిన్ మాలిక్ కేసులో తీర్పు నేపథ్యంలో భారత దేశాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలిపిందని తెలిపారు. మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిపే అన్ని ఆధారాలతో కూడిన పత్రాలను న్యాయస్థానానికి  సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించకూడదని ప్రపంచం కోరుకుంటోందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నామని చెప్పారు.

‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్‌సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు.