
అప్ఘనిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల తలతిక్క నిర్ణయాలతో ప్రజలు విసుగుచెందుతున్నారు. ప్రధానంగా మహిళలపై పెడుతున్న ఆంక్షలు అన్నీ ఇన్నీ కావు. బయటకు రావొద్దని.. ఒకవేళ వస్తే.. ఇంటి వాళ్లతో రావాలని.. విద్యకు దూరంగా ఉండాలని ఎన్నో కఠిన నిబంధనలు పెట్టేస్తున్నారు.
తాజాగా మరో నిర్ణయం తాలిబన్ పాలకులు ప్రకటించారు. టీవీ ప్రజెంటర్లు ముఖం కనిపించకుండా మొత్తం కప్పుకుని వార్తలు చదవాలని కొత్త షరతుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. యాంకర్లే కాకుండా టీవీ ప్రజెంటర్లు, కవరేజ్ కు వెళ్లే మహిళా రిపోర్టర్లు ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ హుకుం జారీ చేసింది.
స్థానిక టీవీ కేంద్రాల్లో పనిచేస్తున్నవారంతా ఈ నిబంధనను పాటించాలని, ఇందుకు టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్లదే బాధ్యత అని హెచ్చరించారు. మీడియా అధికారులతో భేటీ అయ్యామని, తమ సలహాను వారు సంతోషంగా స్వీకరించారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అకీఫ్ మహజర్ ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని అఫ్ఘనిస్తాన్ ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమ ఆదేశాలు పాటించేందుకు మే 21వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని తాలిబన్ మినిస్టర్ అఖిప్ మహజర్ వెల్లడించారు.
ఒకవేళ పాటించని వారిపై ఎదురయ్యే పరిణామాల గురించి తాము ఇప్పుడే వ్యాఖ్యానించబోమని హెచ్చరించడంతో వార్తా సంస్థల్లో పని చేసే మహిళలు భయపడిపోతున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఎన్నో అరాచకాలను ఎదుర్కొన్న మహిళలు ఇప్పుడదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్ లో కాకున్నా ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించారు. కాగా కరోనా సమయంలో ఉపయోగించిన ఫేస్‌మాస్క్ లాంటి వాటిని కూడా వాడొచ్చని ఓ ఉచిత సలహా ఇచ్చాడు.
మత సంబంధ కారణాలతో ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యధిక మహిళలు హెడ్‌కార్ఫ్‌ను ధరిస్తారు. అయితే కాబూల్ లాంటి అర్బర్ ప్రాంతాల్లో మాత్రం మహిళలు ముఖాన్ని కవర్ చేసుకోకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాలను కనిపించనివ్వకూడదంటూ ఆదేశాలు వెలువడిన రోజుల వ్యవధిలో టీవీ మహిళా ప్రజెంటర్లపై ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ నిబంధనలపై అటు ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
More Stories
చైనా – భారత్ సంబంధాలపై మోదీ వ్యాఖ్యలపై చైనా హర్షం
ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
బుధవారం రానున్న వ్యోమగామి సునీతా విలియమ్స్