శ్రీకృష్ణ జన్మస్థానం మధురపై 19న కోర్ట్ తీర్పు 

శ్రీకృష్ణ జన్మభూమి – షాహి ఈద్గా మసీదు వివాదం కేసుకు సంబంధించిన తీర్పుని ఉత్తరప్రదేశ్‌లోని మధుర కోర్టు మే 19న ఇవ్వనుంది. ఈ వివాదంలో మొదటి వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ఇది. జిల్లా జడ్జి రాజీవ్ భారతి మే 19న తన తీర్పును వెలువరించనున్నారు.

సుప్రీం కోర్టు న్యాయవాది రంజనా అగ్నిహోత్రితో సహా మరో ఆరుగురు కృష్ణ భక్తులు మథురలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో సెప్టెంబరు 2020లో ఈ వాజ్యం వేశారు.  1969లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సమితి, హీద్గా వజ్నందియా కమిటీ మధ్య కుదిరిన ఒప్పందం పూర్తిగా చట్టవిరుద్ధం, ఎందుకంటే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సమితికి అలాంటి ఒప్పందం చేసుకునే చట్టపరమైన హక్కు లేదని వాదించారు.

లక్నో నివాసి అగ్నిహోత్రి ప్రకారం, “ఈ విషయంలో కోర్టు ఇచ్చిన సంబంధిత ఒప్పందం, డిక్రీ పూర్తిగా చట్టవిరుద్ధం. కాబట్టి, దానిని రద్దు చేయడం ద్వారా, రాజ ఈద్గాను అక్కడి  నుండి తొలగించి, ఆ  భూమి మొత్తాన్ని దాని హక్కుదారులైన శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ కు దాఖలు చేయాలనీ కోరారు”. అయితే, కోర్టు వారి  డిమాండ్‌ను తిరస్కరించింది. తర్వాత కేసును కూడా జిల్లా జడ్జి కోర్టు కొట్టివేసింది.

రంజనా అగ్నిహోత్రి తదితరులు అక్టోబర్‌లో జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ అక్టోబర్, 2020లో దాఖలు చేశారని జిల్లా ప్రభుత్వ న్యాయవాది శివరామ్ సింగ్ తార్కర్ తెలిపారు. గత  బుధవారం విచారణ పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ, మే 19 తీర్పు వెలువరిస్తున్నట్లు ప్రకటించారు. 

రంజనా అగ్నిహోత్రి తదితరులు దావాను సమర్పించినప్పటి నుండి, ఇప్పటివరకు ఇదే అంశంపై మధురలోని వివిధ కోర్టులలో డజనుకు పైగా కేసులు దాఖలు అయ్యాయి. వాటిపై  నిరంతరం విచారణ కొనసాగుతోంది. రంజనా అగ్నిహోత్రి కేసుపై తీర్పు ఈ కేసులన్నింటిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఈ కేసును కూడా జిల్లా జడ్జి కొట్టివేస్తే, అదే తరహాలో ఉన్న ఇతర దావాలపై ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 

జిల్లా ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. గురువారం జిల్లా జడ్జి కోర్టులో ఫిర్యాది తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ తదితరులు వాదించారు. షాహీ ఈద్గా కమిటీ న్యాయవాదులు ఎప్పటిలాగే అతని వాదనను వ్యతిరేకించారు.  అతని అభ్యర్థనను వినవద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని రిజర్వ్ చేసి మే 19కి తీర్పును ప్రకటించింది.

కాగా, 1669-70లో మొఘల్‌ చక్రవారి ఔరంగజేబు ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి జన్మస్థలం సమీపంలోని కత్రా కేశవ్‌దేవ్‌ ఆలయంలోని 13.37 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన మసీదును తొలగించాలని వ్యాజ్యాలు డిమాండ్‌ చేశాయి.

‘ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సెషన్స్‌ జడ్జి రాజీవ్‌ భారతి శ్రీకృష్ణ జన్మభూమి వ్యాజ్యంపై తీర్పును ప్రకటించడానికి మే 19ని నిర్ణయించారు’ అని జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంజరుగౌర్‌ తెలిపారు.