స్మితా సబర్వాల్కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు విస్మయం

పరువు నష్టం దావా వేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రూ.15 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

 ప్రైవేట్‌ సంస్థపై ప్రైవేట్‌ వ్యక్తిగా పరువు నష్టం దావా వేసి ప్రభుత్వానికి చెందిన రూ. 15 లక్షలను తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించింది. 

సీఎంవోలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ 2015లో అవుట్‌లుక్‌ అనే మ్యాగజైన్‌పై తన ఫొటోను అభ్యంతరకరంగా ముద్రించారన్న అభియోగంపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలను మంజూరు చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అవుట్‌లుక్‌ మ్యాగజైన్‌లో పాటు మరో ఇద్దరు హైకోర్టులోనే వ్యాజ్యం వేశారు. ప్రైవేట్‌ వ్యక్తి ప్రైవేట్‌ సంస్థపై వేసిన కేసు విచారణకు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొంది. 2015లో ఔట్ లుక్ మేగజైన్పై పరువు నష్టం దావా వేసిన స్మిత సబర్వాల్కు అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

ప్రైవేట్ వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదన్న హైకోర్టు..90 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసంగా ఉందని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయపడింది. 

ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. 2015లో తన ఫొటోను అవమానకరంగా ప్రచురించారంటూ స్మిత సబర్వాల్ ఔట్ లుక్ మేగజైన్ పై పరువు నష్టం దావా వేశారు.

స్మితా సబర్వాల్‌ ప్రైవేట్‌ వ్యక్తిగా పరువు నష్టం దావా వేశారన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసమంజసంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని కోర్టు తప్పుపట్టింది.