దిబ్రూగఢ్‌లో 7 క్యాన్సర్ ఆసుపత్రులను ప్రారంభించిన ప్రధాని మోదీ

అస్సాంలోని డిబ్రూఘర్ లోని ఖనికర్ మైదానంలో ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను రతన్ టాటాతో కలసి   ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో ఏడు క్యాన్సర్ ఆస్పత్రులకు రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. రికొద్ది నెలల్లో అస్సాం ప్రజలకు సేవ చేసేందుకు మరో 3 క్యాన్సర్ ఆసుపత్రులను సిద్ధం చేస్తామని హామీ కూడా ప్రధాని ఇచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజీ తదితర ప్రాజెక్టులను ప్రారంభించారు.

‘‘ఆసుపత్రులు మీ సేవలో ఉన్నాయి,  కానీ ఈ కొత్త ఆసుపత్రులు ఖాళీగా ఉంటే నేను సంతోషిస్తాను; నేను మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను. మా ప్రభుత్వం యోగా, ఫిట్‌నెస్, ‘స్వచ్ఛత’తో నివారణ ఆరోగ్య సంరక్షణపై కూడా దృష్టి సారించింది. దేశంలో కొత్త పరీక్షా కేంద్రాలను తెరుస్తున్నారు’ అని ప్రధాని  తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని తెలిపారు. కర్బి అంగ్‌లాంగ్ లోని డిపులో శాంతి , ఐక్యత, అభివృద్ధి సభ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగు పడినందువల్ల సాయుధ దశాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎన్‌పీఏ ) అమలును అస్సాం లోని 23 జిల్లాల్లో, ఈ ప్రాంతం లోని మరికొన్ని ప్రాంతాల్లో రద్దు చేసినట్టు తెలిపారు. 

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అందరితో కలిసి , అందరి అభివృద్ధి, అందరి నమ్మకం , అందరి కృషి, స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సరిహద్దుల సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇటీవల అస్సాం – మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. బోడో ఒప్పందం 2020 లో శాశ్వత శాంతికి నూతన ద్వారాలు తెరిచిందని వివరించారు.

దిబ్రూగఢ్  కేంద్రంలోని ఎసిసిఎఫ్ చే  అభివృద్ధి చేస్తున్న 17 వైద్య సదుపాయాలలో భాగం, వీటిలో ఏడింటిని ప్రధాని తన ఒక రోజు పర్యటన సందర్భంగా ప్రారంభింఛారు. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం ముందు శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

పర్యటన సందర్భంగా ఇక్కడి అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న కేంద్రంలోని సౌకర్యాలు, పరికరాలను ప్రధాని పరిశీలించారు. ఇలాంటి మరో ఆరు సౌకర్యాలను బార్‌పేట, తేజ్‌పూర్, జోర్హాట్, లఖింపూర్, కోక్రాఝర్, దర్రాంగ్‌లలో కూడా ప్రారంభించారు. ఇదే కార్యక్రమం  ప్రాజెక్టు కింద ధుబ్రి, గోల్‌పారా, గోలాఘాట్, శివసాగర్, నల్బరీ, నాగాన్ మరియు టిన్సుకియాలో ఏడు ఆసుపత్రులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

టాటా ట్రస్ట్‌ల ప్రతినిధి ఒకరు ఇంతకుముందు మాట్లాడుతూ, ఇలాంటి మరో మూడు క్యాన్సర్ కేర్ సదుపాయాలు పూర్తి దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరిలో తెరుస్తామని తెలిపారు. 17 వైద్య సదుపాయాలు, టాటా ట్రస్ట్‌ల క్యాన్సర్ నియంత్రణ నమూనా కింద “అతిపెద్ద” నెట్‌వర్క్, అస్సాం నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా సంవత్సరానికి 50,000 మందికి సేవలను అందించనున్నట్లు ఆయన చెప్పారు.