
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుదీర్ఘ సెలవుపై వెళ్లారా అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో గత ఆదివారం జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై ఆయన ఈ ప్రశ్నాస్త్రం సంధించారు.
”రాజస్థాన్‌లో పిల్లలపై, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పాలనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ దేశంలోనే ఉన్నారా? అనే ఆశ్చర్యం నాకు కలుగుతోంది” అని మంత్రి ఎద్దేవా చేశారు.
రాజస్థాన్ పోలీసుల కథనం ప్రకారం, గత ఆదివారం దౌస జిల్లాలోని ఓ గ్రామంలో 35 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. జైపూర్ జిల్లా బస్సీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనపై అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, మృతదేహాలను బావుల్లోకి విసిరేస్తున్నారని, రాహుల్ తరహాలోనే సోనియాగాంధీ, ప్రియాంక కూడా సెలవులు గడిపేందుకు వెళ్లిపోయారా/ అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితి వారికి కనబడటం లేదా? అని అనురాగ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్ ప్రభుత్వం ఎందుకు మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకుంటోందని కేంద్ర మంత్రి నిలదీశారు. పార్టీ, ప్రభుత్వం తక్షణం నిద్ర నుంచి మేల్కొని గట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు ఠాకూర్ చెప్పారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం
ఢిల్లీ కొత్త సీఎం 20న ప్రమాణస్వీకారం!