మోదీ ప్రభుత్వ 8వ వార్షికోత్సవ సంబరాలకు సన్నాహాలు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8వ వార్షికోత్సవం మే 30న పెద్ద ఎత్తున జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) విస్తృతమైన సన్నాహాలు జరుపుతున్నది. రెండో విడత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున జరపలేక పోవడంతో, ఈ సారి మూడవ ఏడాది పెద్ద ఎత్తున జరపనున్నారు.

వార్షికోత్సవానికి నెల రోజుల సమయం ఉన్నందున, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై, జరుపవలసిన కార్యక్రమాల గురించి చర్చించింది. గత ఏడాది కరోనా రెండో వేవ్ సమయంలో దేశ మంతటా ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉండడంతో సంబరాలు లేకుండా, కరోనా బాధితుల సంక్షేమంకు ఈ రోజును అనికితం చేశారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను బిజెపి కార్యకర్తలు దేశ వ్యాప్తంగా జరిపారు. ఈ సంవత్సరం కూడా, దేశంలో కరోనా ఉధృతంగా తక్కువగా ఉండడం,  దాదాపు అర్హులైన పెద్దలందరికీ పూర్తిగా టీకాలు వేసి ఉండడంతో భారీ ఎత్తున కార్యక్రమాలు జరిపే అవకాశం ఉంది.

అధికారికంగా, ఈ సందర్భంగా చేబట్టబోయే కార్యక్రమాల గురించి బిజెపి ప్రకటించకపోయినప్పటికీ, `ప్రధాన్ మంత్రి సే ప్రధాన్ సేవక్’ సందేశంతో  72 ఏళ్ల ప్రధానమంత్రి   నిరాడంబరమైన జీవనం గురించి, దేశంలో ఒక సాధారణ వ్యక్తి అత్యున్నత పదవిని పొందే అవకాశాన్ని ఇది ఎలా సూచిస్తుందో గురించి విస్తృతంగా  ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

కొన్ని కీలక ఘట్టాలను సంగ్రహించే ఛాయాచిత్రాలు, పోస్టర్ల ద్వారా ఈ ప్రయాణంపై ప్రచారం దృష్టి సరింప[నున్నది. “మోదీ ప్రజా జీవితం ప్రజలకు సేవ చేయడమే తప్ప రాజకీయ అధికారం కోసం కాదు. ఆయనకు రాజకీయ పదవులు పాలన, పరిపాలన కోసం. అందుకే పేదలకు ప్రత్యక్ష ప్రయోజనాలు లభిస్తున్నాయి, అందుకే రాష్ట్రాల తర్వాత బీజేపీని ఎన్నుకుంటున్నారు’’ అని పార్టీ సీనియర్ నేత దినేష్ త్రివేది పేర్కొన్నారు.

 
దేశ ప్రయోజనాల విషయానికి వస్తే, ఆయన రాజకీయ లాభనష్టాలను పట్టించుకోకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంతున్నారని కొనియాడారు. ఈ అంశాల ప్రాతిపదిక అనేక ఐటిబీరుత్తలతో ఇ- పుస్తకాలు తీసుకు రావాలని కూడా భావిస్తున్నారు.  కరోనాను  ఎదుర్కోవడంలో భారతదేశం ప్రధాన పాత్ర పోషించడం ఆ విధంగా తీసుకొచ్చే ఓ ప్రచురణ కావచ్చని చెబుతున్నారు. 

మూడు రోజుల సదస్సును నిర్వహించి, ఇందులో వివిధ క్యాబినెట్ మంత్రులు, నిపుణులు గత ఎనిమిదేళ్ల పాలనకు సంబంధించి వివిధ అంశాలను వివరించేటట్లు చేయాలని చూస్తున్నారు. ఇదివరలో చేసిన్నట్లు ఈ సమయంలో కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రభుత్వ  కార్యక్రమాలు,విజయాలను వివరిస్తారు. 
 
ఇక సోషల్ మీడియా, మీడియా ద్వారా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం పార్టీలో వివిధ విభాగాలు ప్రభుత్వ విజయాలను వివరించే వీడియోలను సిద్ధం చేస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగాలను ఉదహరిస్తూ, ఇన్ఫోగ్రాఫిక్ లతో కలిపి ప్రజలకు సులభంగా చేరేటట్లు ఆలోచనలు చేస్తున్నారు. 

“పార్టీ 8వ వార్షికోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే అంశంపై వివిధ సూచనలను పరిశీలిస్తున్నాము. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఉంటాయి.  పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాలు ప్రసంగిస్తారు” అని పార్టీ నేత ఒకరు తెలిపారు.
 
 “గతంలో చేసినట్లుగా, వేడుకల కోసం థీమ్ ఎంపిక చేస్తాము.  ప్రభుత్వ పథకాల గురించి వివరించడానికి, సందేశాన్ని   ప్రజల వద్దకు తీసుకోవడానికి వివిధ జిల్లాలకు నేతలు, మంత్రులు వెడతారు” అని వివరించారు.

సోమవారం నాటి సమావేశంలో వేడుకలను ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రజెంటేషన్ చేశారు. “కార్యక్రమాల దృష్టి ప్రజల-కేంద్రీకృత పథకాలు, అవి పేదలు,  అట్టడుగు వర్గాల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి” అనే అంశంపై ఉంటాయని మరో నేత తెలిపారు.
“సేవ, సంపర్క్”పై దృష్టి కొనసాగుతుందని , ప్రజలకు చేరుకొనేవిధంగా  కార్యక్రమాలు “లబ్దిదారులు, ప్రభావశీలులను” లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు. గత ఏడాది 100,000 గ్రామాలకు సీనియర్ నాయకులు, మంత్రులను పంపాలని పార్టీ నిర్ణయించింది. మానవతా సేవలపై దృష్టి సారించాలని పార్టీ కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు సూచించారు. పార్టీ కార్యకర్తలు ఈ గ్రామాల్లో కరోనా నివారణ, సహాయ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.