ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. గత క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన జగన్ సొంత జిల్లా కడపకు చెందిన అంజాద్ బాషకు ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడమే కాకుండా గతంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖనే కట్టబెట్టారు.
అలాగే మరో డిప్యూటీ సీఎం రాజన్నదొర కు గిరిజన సంక్షేమ శాఖ.. ఇంకో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ.. మరో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు దేవాదాయశాఖ మంత్రిగా, నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు.
మరోసారి దళిత మహిళా తానేటి వనితకు హోంశాఖ, రోజాకు పర్యాటకం, అంబటి రాంబాబుకు జలవనరులు, కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయం శాఖలు ఇచ్చారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కడప జిల్లాకు చెందిన అంజాద్ బాష, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరామ్, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, నారాయణస్వామి, విశ్వరూప్, తానేటి వనిత, సీదిరి అప్పలరాజులకు జగన్ క్యాబినెట్ లో రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కింది.
మంత్రిపదవులు తీసివేయడంతో అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి సుచరిత మంత్రుల ప్రమాణస్వీకారంకు హాజరు కాలేదు. సుచరిత అయితే ఎమ్యెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు. శ్రీనివాసరెడ్డి రాజకీయాలకే స్వస్తి చెబుతున్నట్లు చెబుతున్నారు.
పెద్దిరెడ్డి- విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం
ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ
అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ
తొలుత 25 మంది మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో మంత్రుల పేర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చదువుతుండగా వారితో గవర్నర్ ప్రమాణం చేయించారు. మొదట సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేయగా… చివరలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ప్రమాణం చేశారు.
కొత్త కేబినెట్ లో 11 మంది పాత మంత్రులను కొనసాగించగా, కొత్తగా 14 మందికి అవకాశం మిచ్ఛారు. మంత్రులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. అమరావతిలోని సెక్రటేరియట్ ఆవరణలో జరిగిన కార్యక్రమాలు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ