టీఆర్ఎస్ ధర్నాలో వేధింపులకు గురైన మున్సిపల్ ఛైర్ పర్సన్ 

భద్రాద్రి కొత్తగూడం జిల్లా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వడ్లు కొనుగోలు చేయాలని మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో సొంత పార్టీ నాయకురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి అవమానానికి గురయ్యారు.
 
మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా ప్రవర్తించారని చైర్ పర్సన్ కన్నీటి పర్యంతం అయిన వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి.  వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసనలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మితో ఆకతాయిల్లా మహిళ కౌన్సిలర్ల భర్తలు వ్యవహరించారు.
వెనుక నుంచి బైకులతో ఢీ కొడుతూ  తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను ర్యాలీ చేస్తున్నప్పుడు అగౌరపరిచారని పార్టీ పెద్దలకు ఆమె ఫిర్యాదు చేశారు.  వారికి ఎంత చెప్పిన వినకుండా తనతో ఆకతాయిల్లా వ్యవహరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తనను వెనుక నుంచి బైకులతో ఢీకొట్టి చీర ఊడిపోయేలా చేశార‌ని, తనను అగౌరవపరిచారని ఏడుస్తూ ఆమె పార్టీ శ్రేణులకు ఫిర్యాదు చేశారు. ‘‘బైక్ తో ఢీకొట్టే వారికి దండం పెడుతున్న.. కానీ తనతో ఆకతాయిల్లాగా వ్యవహరించారని కన్నీరుమున్నీరవుతూ గోడు వెల్లబోసుకున్నారు.
.తాను ఇబ్బంది పడుతున్నానని, దండం పెడుతూ వేడుకున్నా వారు  వినకుండా అదే పనిగా తన కాలి భాగాన్ని ఢీ కొడుతూ  ర్యాలీ కొనసాగించారని  ఆమె వాపోయారు. తనకు జరిగిన అవమానం గురించి  ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చైర్ పర్సన్ చెబుతున్నారు.