హిజాబ్ వివాదంపై అల్ ఖైదా చీఫ్ వీడియోపై ఆగ్రవేశాలు

హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్‌ ఖైదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌ జవహరి విడుదల చేసినట్లుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.  అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలలో యూనిఫాం ప్రాముఖ్యతను అల్ ఖైదా అర్థం చేసుకోలేదని,  కానీ భారతీయ ముస్లింలు అర్థం చేసుకుంటారని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  
 
కర్నాటక హైకోర్టు ఆమోదించిన ప్రభుత్వ హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ, అస్సాం సిఎం మతపరమైన దుస్తులను నిరోధించకపోతే, విద్యాసంస్థలు మత ప్రవర్తనల ప్రదర్శనకు వేదిక అవుతాయని ఆయన హెచ్చరించారు.  అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహిరి 8.43 నిమిషాల క్లిప్‌ను విడుదల చేశారు, అందులో ముస్కాన్ ఖాన్ జై శ్రీరాం అని నినాదాలు చేస్తున్న అబ్బాయిల గుంపును ప్రతిఘటించిన వీడియో వైరల్‌గా మారింది. 
 
‘ హిందూ భారతదేశపు వాస్తవికతను, దాని అన్యమత ప్రజాస్వామ్యపు  మోసాన్ని బహిర్గతం చేసినందుకు అల్లా ఆమెకు ప్రతిఫలమివ్వాలి’ అని ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన జవహిరి కొనియాడారు. ‘మనల్ని కలవరపరిచే భ్రమలను మనం పారద్రోలాలి… భారతదేశంలోని అన్యమత హిందూ ప్రజాస్వామ్యం యొక్క ఎండమావిలో మనం మోసపోవడాన్ని ఆపాలి, ఇది ముస్లింలను అణచివేసే సాధనం కంటే ఎక్కువ కాదు’  అని పేర్కొన్నాడు.
 
కాగా,  హిజాబ్ వివాదం వెనుక ‘కనిపించని చేతులు’  ఉన్నాయని ఈ వీడియో రుజువు చేస్తుందని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ధ్వజమెత్తారు.  
 
విద్యార్థిని తండ్రి ఖండన 
 
ముస్కాన్ తండ్రి మహ్మద్‌ హుస్సేన్‌ ఖాన్‌  జవహిరి వ్యాఖ్యలు తప్పని  స్పష్టం చేశారు. తాము భారత్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నామని చెబుతూ  ఇలాంటి సంఘటనలు కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.  నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణనైనా ప్రారంభించవచ్చునని చెప్పారు. 
 
ఈ వీడియో గురించి తమకేమీ తెలియదని,  చెబుతూ అతనెవరో తెలియదని, తొలిసారిగా చూస్తున్నానని, అరబిక్‌ భాషలో మాట్లాతున్నారని ముస్కన్‌ తండ్రి పేర్కొన్నారు. ప్రజలు వారికి తోచిన విధంగా మాట్లాడాతారని, దీని వల్ల అనవసరంగా ఇబ్బందులకు గురౌతున్నామని చెప్పారు. 
 
దేశంలో శాంతియుతంగా జీవిస్తున్నామని, తమ దేశ సమస్య గురించి మాట్లాడేంందుకు. మీరెవారు? అంటూ ప్రశ్నించారు. ఇది ఆయనకు అనవసరమైన విషయమని, అతనికి, తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.  కాబట్టి.. తమ గురించి మాట్లాడకూడదని కోరుకుంటున్నానని విజ్ఞప్తి చేశారు.